పేర్ని నానికి బిగుస్తున్న ఉచ్చు.. తండ్రి కొడుకులకు పోలీస్ నోటీసులు
ABN, Publish Date - Dec 22 , 2024 | 03:08 PM
పేర్ని నానికి సంబంధించిన గోడౌన్ల నుంచి రేషన్ బియ్యం మాయమైన కేసులో పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. మాజీ మంత్రి పేర్ని నానితోపాటు ఆయన కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే వారు ఇంట్లో లేకపోవడంతో గోడకు నోటీసులు అంటించారు.
పేర్ని నానికి సంబంధించిన గోడౌన్ల నుంచి రేషన్ బియ్యం మాయమైన కేసులో పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. మాజీ మంత్రి పేర్ని నానితోపాటు ఆయన కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే వారు ఇంట్లో లేకపోవడంతో గోడకు నోటీసులు అంటించారు. కేసు దర్యాప్తునకు సహకరించాలని వారు ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. మధ్యాహ్నంలోపు స్టేషన్‌కు వచ్చి కేసు విషయాలతోపాటు తమ దగ్గర ఉన్న రికార్డులను అందజేయాలని పోలీసులు ఆదేశించారు. పేర్ని నాని భార్య జయసుధ, ఆమె పీఏ మానస తేజ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మరిన్నీఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Dec 22 , 2024 | 03:08 PM