Share News

CM Revanth Reddy: హైదరాబాద్‌ను AI అంతర్జాతీయ కేంద్రంగా మార్చడమే టార్గెట్

ABN , Publish Date - Sep 05 , 2024 | 12:16 PM

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో తొలిసారి అంతర్జాతీయ కృత్రిమ మేధా సదస్సు జరుగుతోంది. హెచ్ఐసీసీ వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. వివిధ దేశాల నుంచి సదస్సుకు 2వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఇవాళ, రేపు రెండు రోజులపాటు AI గ్లోబల్ సమ్మిట్ కొనసాగనున్నది

CM Revanth Reddy: హైదరాబాద్‌ను AI అంతర్జాతీయ కేంద్రంగా మార్చడమే టార్గెట్

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో తొలిసారి అంతర్జాతీయ కృత్రిమ మేధా సదస్సు జరుగుతోంది. హెచ్ఐసీసీ వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. వివిధ దేశాల నుంచి సదస్సుకు 2వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఇవాళ, రేపు రెండు రోజులపాటు AI గ్లోబల్ సమ్మిట్ కొనసాగనున్నది. “Making AI work for every one'' అనే థీమ్‌తో సదస్సు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ను AI అంతర్జాతీయ కేంద్రంగా మార్చే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. హైదరాబాద్‌లో ఫోర్త్ సిటీ సిటీ ఏర్పాటు లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు సీఎం. సదస్సుకు సంబంధించిన మరింత సమాచారం ఈ లింక్ క్లిక్ చేసి వీడియోలో చూడగలరు

Updated Date - Sep 05 , 2024 | 12:16 PM