Madhapur: కాలేజ్‌లో ఫుడ్ పాయిజన్.. సీక్రెట్‌గా 100 మంది విద్యార్థులకు చికిత్స

ABN, Publish Date - Sep 27 , 2024 | 05:09 PM

మాదాపూర్ డివిజన్ కావూరి హిల్స్ శ్రీ చైతన్య కాలేజీ అక్షర కో గర్ల్స్ క్యాంపస్‌లో విద్యార్థులు శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. సుమారు 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో వారిని దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

హైదరాబాద్: మాదాపూర్ డివిజన్ కావూరి హిల్స్ శ్రీ చైతన్య కాలేజీ అక్షర కో గర్ల్స్ క్యాంపస్‌లో విద్యార్థులు శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. సుమారు 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో వారిని దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్ అయినట్లు వెల్లడి కావడంతో ఎవరికీ తెలియకుండా చికిత్స చేయిస్తున్నారని విద్యార్థి సంఘం నాయకుడు నవీన్ యాదవ్ ఆరోపించారు. కనీసం తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వలేదని, కాలేజీ నిర్వాహకులు వారి ఫోన్‌లు కూడా లిఫ్ట్ చేయడం లేదని ఆయన మండిపడ్డారు. అయితే కాలేజీ యాజమాన్యం మాత్రం ఎవరికి ఫుడ్ పాయిజన్ కాలేదని, వైరల్ ఫీవర్ వచ్చిందని చెబుతున్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Sep 27 , 2024 | 05:09 PM