కొడాలి నాని ప్రధాన అనుచరుడు అరెస్ట్
ABN, Publish Date - Dec 31 , 2024 | 03:36 PM
Andhrapradesh: కొడాలి నానికి సంబంధించిన ప్రతీ విషయంలోనూ కాళీ ప్రధాన పాత్ర పోషించాడు. అధికారంలో ఉండగా కొడాలి నాని అండను చూసుకుని కాళి పెట్రేగిపోయిన సందర్భాలు ఎన్నో. ఆయనపై అనేక కేసులు కూడా నమోదు అయ్యాయని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో కాళీని అస్సాంలో పట్టుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
కృష్ణా జిల్లా, డిసెంబర్ 31: కృష్ణా జిల్లా వైసీపీ యువజన విభాగ అధ్యక్షుడు, మాజీ మంత్రి కొడాలి నాని (Former minister Kodali Nani) ప్రధాన అనుచరుడు మెరుగు మాల కాళీని పోలీసులు అరెస్ట్ చేశారు. అధికారంలో ఉండగా గుడివాడ టీడీపీ కార్యాలయం, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుపై దాడిలో కాళీ కీలక సూత్రధారిగా ఉన్నాడు. వైసీపీ అధికారంలో ఉండగా గడ్డం గ్యాంగ్ ముసుగులో అనేక అరాచకాలకు కాళీ పాల్పడ్డాడు. ఇప్పటికే ఈ కేసులో 13 మంది వైసీపీ నేతలు రిమాండ్‌లో ఉన్నారు. ఈ దాడికి కీలక సూత్రధారి అయిన కాళీని అస్సాంలో పోలీసులు బృందాలు పట్టుకున్నారు. కొడాలి నానికి సంబంధించిన ప్రతీ విషయంలోనూ కాళీ ప్రధాన పాత్ర పోషించాడు. అధికారంలో ఉండగా కొడాలి నాని అండను చూసుకుని కాళి పెట్రేగిపోయిన సందర్భాలు ఎన్నో. ఆయనపై అనేక కేసులు కూడా నమోదు అయ్యాయని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో కాళీని అస్సాంలో పట్టుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
ఈరోజు సాయంత్రం లేదా రేపు (బుధవారం) మధ్యాహ్నానికి కాళీని విజయవాడకు లేదా గుడివాడకు తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కాళీ ద్వారా అనేక మంది బాధితుల ఫిర్యాదు చేయడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖాళీని విచారిస్తే మరికొన్ని వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో దాదాపు 13 మంది వైసీపీ నేతలను రిమాండ్‌లోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి...
ఇలా చేస్తే కొత్త సంవత్సరంలో జనవరి ఫూల్స్ అవుతారు..
బాస్ నన్ను అనకూడని మాటలు అంటున్నాడు: యువ ఉద్యోగి
Read Latest AP News And Telugu News
Updated at - Dec 31 , 2024 | 03:36 PM