Janwada Farm House: నెక్స్ట్ జన్వాడ ఫామ్ హౌసేనా? |

ABN, Publish Date - Aug 24 , 2024 | 12:18 PM

నాగార్జున ఎన్‌కన్వేషన్ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. కూల్చివేసిన వాటిని అధికారులు పక్కకు తొలగిస్తున్నారు. అయితే తర్వాత ఫోకస్ జన్వాడ ఫామ్ హౌస్‌పై పెట్టినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్: నాగార్జున ఎన్ కన్వెన్షన్‌‌ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఎన్ కన్వెన్షన్‌‌ తర్వాత ఫోకస్ జన్వాడ ఫామ్ హౌస్‌పై పెట్టినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా మాజీ మంత్రి కేటీఆర్‌ జన్వాడ ఫామ్ హౌస్‌ గురించి వార్తలు వస్తున్నాయి. ఫామ్ హౌస్‌‌ను అధికారులు కూల్చివేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.


మాజీ మంత్రి మల్లారెడ్డిపై హైడ్రా అధికారులు దృష్టిసారించినట్టు తెలుస్తోంది. చెరువులు, నాలాలు ఆక్రమించి మల్లారెడ్డి నిర్మించిన యూనివర్సిటీ, కాలేజీ, హాస్పిటల్‌పై హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. మల్లారెడ్డి ఆక్రమించి నిర్మించిన చెరువులు, నాలాలను హైడ్రా అధికారులు పరిశీలించారు. రేపో, మాపో మల్లారెడ్డి అక్రమ కట్టడాలను కూల్చివేతకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.


ఎన్‌కన్వెషన్‌‌ షెడ్ల కూల్చివేతలు..

ఎన్‌కన్వెషన్‌‌లో ఉన్న నిర్మాణాలను పూర్తిగా కూల్చివేస్తున్నారు. అటు వైపు ఎవర్నీ వెళ్లనీయడం లేదు. చుట్టు ఉన్న ప్రహారీలను కూడా కూల్చివేస్తున్నారు. దాంతో పాటు లోపల ఉన్నటువంటి షెడ్లను కూడా కూల్చివేశారు. గేట్లను కూడా తొలగించారు. గేటు నంబర్ - 3 వరకు కూడా ఉన్న నిర్మాణాలను లోపల ఉన్నటువంటి వాటిని కూడా తొలగిస్తున్నారు. అందులో ఉన్న సామగ్రిని తీసి పక్కను పెడుతున్నారు.


ఎన్‌కన్వెషన్‌కు సంబంధించిన నిర్వాహకులు కూడా అక్కడకు తరలివస్తున్నారు. అయితే వారిని లోపలకు అనుమతించడం లేదు. నిర్మాణానికి సరఫరా అయ్యే కరెంట్‌ను కూడా పూర్తిగా నిలిపివేశారు. ఇందులో ఉన్నటువంటి ఇనుప సామాన్లను కట్టర్ల సహాయంతో తొలగిస్తున్నారు. పోలీసులు చుట్టుపక్కల ఉన్న వారిని ఎవర్నీ కూడా రానీయడం లేదు. చుట్టు పక్కల దుకాణ సముదాయాలను మూసివేశారు. కూల్చివేతలు పూర్తి చేసేవరకు అటువైపు ఎవర్నీ పంపించమని హైడ్రా అధికారులు చెబుతున్నారు.

Updated at - Aug 24 , 2024 | 07:40 PM