లుంగీ కట్టుకొని బెడ్ రూమ్ లో కూర్చో..ఎమ్మెల్యే మాధవి ప్రెస్ మీట్

ABN, Publish Date - Dec 23 , 2024 | 06:22 PM

కడప నగర మేయర్, వైసీపీ నేత సురేష్ బాబుపై స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ నేత ఆర్ మాధవీ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన మేయర్ కూర్చిలో కూర్చోవడానికి అనర్హుడని పేర్కొన్నారు.సోమవారం కడపలో నగర పాలక సంస్థ సర్వ సభ్య సమావేశంలో మేయర్ వ్యవహరించిన తీరును విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఎండగట్టారు.

కడప నగర మేయర్, వైసీపీ నేత సురేష్ బాబుపై స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ నేత ఆర్ మాధవీ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన మేయర్ కూర్చిలో కూర్చోవడానికి అనర్హుడని పేర్కొన్నారు.సోమవారం కడపలో నగర పాలక సంస్థ సర్వ సభ్య సమావేశంలో మేయర్ వ్యవహరించిన తీరును విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఎండగట్టారు. 54 ప్రజా సమస్యలపై చర్చకు తీసుకు వస్తే.. వాటిపై ఆయన మాట్లాడనివ్వలేదన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డికి అధికారులు కుర్చీ వేయలేదు. దీంతో ఎమ్మెల్యేతో పాటు టీడీపీ సభ్యులు నిరసన చేపట్టారు. మేయర్‌ పోడియం వద్ద నిలబడిన ఎమ్మెల్యే మాధవీరెడ్డి నిరసనకు దిగారు.


గతంలో జరిగిన సమావేశంలో సైతం మేయర్.. ఎమ్మెల్యే మాధవి రెడ్డికి కుర్చీ వేయకపోవడంతో వాగ్వాదం చోటు చేసుకొంది. ఇక ఈ రోజు కూడా సర్వసభ్య సమావేశంలో కుర్చీ వేయకపోవడంతో ఉదయం నుంచి గొడవ జరుగుతోంది. మొత్తంగా ఎమ్మెల్యేకు కుర్చీ వేయకపోవడంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యేకు కుర్చీ వేసే వరకు సమావేశం జరగకూడదని టీడీపీ పట్టుపడుతుండగా.. ఈ సమావేశం ఎలాగైనా నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు పట్టుపట్టారు. మేయర్ మహిళలను అవమానిస్తున్నారని, ఆయన అవినీతి పరుడని ఎమ్మెల్యే మాధవి రెడ్డి విమర్శించారు. ఈ గందరగోళం నేపథ్యంలో మేయర్ సురేష్ బాబు సమావేశాన్ని వాయిదా వేశారు.


సోమవారం ఉదయం 11 గంటలకు నగర కార్పోరేషన్ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే మాధవి రెడ్డికి మేయర్ చాంబర్‌లో కూర్చీ వేయలేదు. మేయర్ సురేష్ బాబు, మాధవి రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. మహిళను అవమానిస్తారా.. ఇక్కడ కుర్చీ మీరు లాగేసినా ప్రజలు తనకు కుర్చీ ఇచ్చారని, కుర్చీల కోసం పోరాడాల్సిన అవసరం తనకు లేదని ఎమ్మెల్యే అన్నారు. సమావేశమంతా నిల్చొని మాట్లాడే శక్తి తనకుందన్నారు. మేయర్‌కు ఈ సలహా ఎవరు ఇచ్చారో తెలియదు కానీ, కడప నియోజక వర్గంలోని మహిళలను అవమానిస్తే.. వాళ్ల నాయకుడు సంతోషిస్తాడో.. లేకపోతే మేయర్, కార్పొరేటర్ల కుర్చీలు తీసివేస్తారేమో అన్న భయం పట్టుకుందో తెలియదుగానీ కుర్చీలాట మొదలెట్టారని ఎమ్మెల్యే మండిపడ్డారు. ఈ క్రమంలో సమావేశంలో గందరగోళం నెలకొంది. ఒకవైపు వైఎస్సార్‌సీపీ, మరోవైపు టీడీపీ కార్పొరేటర్లు నిరసన తెలిపారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Dec 23 , 2024 | 06:26 PM