ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు విద్యార్థులు లేఖ

ABN, Publish Date - Oct 22 , 2024 | 08:45 PM

షాద్‌నగర్-ఆమన్ గల్ రూట్లలో బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నామని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు విద్యార్థులు లేఖ రాశారు. ఈ రూట్‌‌లో గతంలో 10 బస్సులు నడిపితే.. ప్రస్తుతం 4 బస్సులే నడుపుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రూట్‌లో బస్సుల సంఖ్యను పెంచాలని ఆర్టీసీ ఎండీకి రాసిన లేఖలో విద్యార్థులు విజ్ఞప్తి చేశారు.

షాద్‌నగర్-ఆమన్ గల్ రూట్లలో బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నామని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు విద్యార్థులు లేఖ రాశారు. ఈ రూట్‌‌లో గతంలో 10 బస్సులు నడిపితే.. ప్రస్తుతం 4 బస్సులే నడుపుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రూట్‌లో బస్సుల సంఖ్యను పెంచాలని ఆర్టీసీ ఎండీకి రాసిన లేఖలో విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. ఇక బస్ పాస్ విషయంలో ఆర్టీసీ అమలు చేస్తున్న నిబంధనలు సైతం తమకు ఇబ్బందికరంగా మారాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.


డిగ్రీ కాలేజీలు.. ఊరికి దూరంగా ఉండటంతో.. ఆర్టీసీ 35 కిలోమీటర్ల పరిమితి విధించడం వల్ల తాము ఇక్కట్లు పడుతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. డిగ్రీ, హైయ్యర్ ఎడ్యూకేషన్ చేసే వారికి 60 కిలోమీటర్ల వరకు బస్ పాస్ పరిమితిని పెంచాలని ఎండీని విద్యార్థులు డిమాండ్ చేశారు. అలాగే బస్సు సర్వీసులు సంఖ్య తక్కువగా ఉండడంతో.. తాము పడుతున్న ఇక్కట్లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆర్టీసీ ఎండీ‌కి విద్యార్థులు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

మరిన్నీ ఏబీఎస్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated at - Oct 22 , 2024 | 08:45 PM