Indian Railways: భారతీయ రైళ్లపై 'ఉగ్ర' కుట్ర.. వరుస ఘటనలు దేనికి సంకేతం
ABN, Publish Date - Sep 23 , 2024 | 09:43 PM
దేశంలోని వివిధ ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లపై గ్యాస్ సిలిండర్లు, డిటోనేటర్లు, సిమెంట్ దిమ్మలు ప్రత్యక్షమవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో కాన్పూర్ సమీపంలోని ప్రేమ్‌పూర్ రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలెండర్‌ను రైల్వే లోకో పైలట్ గమనించారు.
ఢిల్లీ: దేశంలోని వివిధ ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లపై గ్యాస్ సిలిండర్లు, డిటోనేటర్లు, సిమెంట్ దిమ్మలు ప్రత్యక్షమవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో కాన్పూర్ సమీపంలోని ప్రేమ్‌పూర్ రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలెండర్‌ను రైల్వే లోకో పైలట్ గమనించారు. దీంతో రైలును లోక్ పైలట్ ఆపేశారు. మధ్యప్రదేశ్‌లోని బ్రుహన్‌పూర్ జిల్లాలో గత బుధవారం రైల్వే ట్రాక్‌పై 10 డిటోనేటర్లును లోక్ పైలట్ గుర్తించి రైలును ఆపి వేయడంతో పెను ప్రమాదం తప్పింది. జమ్మూ కశ్మీర్ నుంచి కర్ణాటకకు ఆర్మీ జవాన్లతో వెళ్తున్న ఈ ప్రత్యేక రైలు లక్ష్యంగా ఈ డిటోనేటర్లు అమర్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తీవ్రవాద వ్యతిరేక దళం, జాతీయ దర్యాప్తు సంస్థతోపాటు స్థానిక పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనల వెనక ఉగ్రవాదుల కుట్రలున్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి. మరిన్ని వివరాలు ఈ వీడియోలో..
Updated at - Sep 23 , 2024 | 09:44 PM