Share News

Ts News: విరిగిన విద్యార్థిని కాలు

ABN , Publish Date - Sep 14 , 2024 | 05:13 PM

టీచర్ వేధింపులు తాళలేక విద్యార్థిని హాస్టల్ భవనంపై నుంచి దూకింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మద్దరాలలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో జరిగింది. ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందజేశారు. వాష్ రూమ్‌లో కాలు జారి పడిందని అబద్దాలు చెప్పారు.

Ts News: విరిగిన విద్యార్థిని కాలు
Teacher Harassed Student

ఓ విద్యార్థిని టీచర్ వేధించింది. వాష్ రూమ్‌ వెళ్లినా సరే నరకయాతన చూపించింది. ఆ టీచర్ గురించి విద్యార్థిని పేరంట్స్‌కు చెప్పుకోలేదు. కంప్లైంట్ చేస్తే ఎక్కువ టార్చర్ పెడుతోందని భయపడింది. వేధింపులు తాళలేక హాస్టల్ భవనంపై నుంచి దూకింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మద్దరాలలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో జరిగింది. ఘటన జరిగిన తర్వాత విద్యార్థిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. వాష్ రూమ్‌లో కాలు జారి పడిందని అబద్దాలు చెప్పారు. ఏం జరిగిందని విద్యార్థిని ఆరా తీయడంతో అసలు విషయం తెలిసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి వద్దకు కలెక్టర్ వచ్చి, పరామర్శించారు.

Updated Date - Sep 14 , 2024 | 05:13 PM