సత్ప్రవర్తనతో మెలగండి
ABN , Publish Date - Mar 21 , 2025 | 12:20 AM
నేరాలు చేసి జైలు జీవితం గడుపుతున్న వారు బయటికి వెళ్లాక సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి శివప్రసాద్ యాదవ్ అన్నారు.

హిందూపురం, మార్చి 20(ఆంధ్రజ్యోతి): నేరాలు చేసి జైలు జీవితం గడుపుతున్న వారు బయటికి వెళ్లాక సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి శివప్రసాద్ యాదవ్ అన్నారు. గురువారం పట్టణంలోని సబ్‌జైలును ఆయన తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ నేరాలుచేసి జైలుపాలైతే మీ కుటుంబ సభ్యులు సమాజంలో ఇబ్బంది పడతారన్నారు. వీరు బయటకు వెళ్లిన తరువాత సత్ప్రవర్తనతో మెలిగి మరోసారి తప్పు చేయకుండా సన్మార్గంలో నడవాలన్నారు. అనంతరం జైలులో రికార్డులు పరిశీలించారు. నిందితులు ఏఏ కేసుల్లో జైలులో ఉన్నారని ఆరాతీశారు. 18ఏళ్లలోపు, 70ఏళ్లు పైబడినవారుంటే వెంటనే న్యాయస్థానానికి తెలియజేయాలన్నారు. ఆయన వెంట బార్‌అసోసియేషన అధ్యక్షుడు రాజశేఖర్, న్యాయవాది సిద్దు, సదాశివరెడ్డి, సంతో్‌షకుమారి, మురళి, అంజినమ్మ, లోక్ అదాలత సిబ్బంది హేమావతి, శారద ఉన్నారు.