COMPTITION: రైతులను ప్రోత్సహించేందుకే ఎడ్లబండ్ల పోటీలు
ABN , Publish Date - Mar 15 , 2025 | 12:02 AM
వ్యవసాయంలో పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రైతుల్లో సంతోషాన్ని నింపేందుకే ఎడ్లబండ్ల పోటీలు నిర్వహిస్తున్నట్లు శంకర్‌లాల్ నాయక్ తెలిపారు.

గోరంట్ల, మార్చి 14(ఆంధ్రజ్యోతి): వ్యవసాయంలో పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రైతుల్లో సంతోషాన్ని నింపేందుకే ఎడ్లబండ్ల పోటీలు నిర్వహిస్తున్నట్లు శంకర్‌లాల్ నాయక్ తెలిపారు. మండలంలోని కరావులపల్లితండా అభయాంజనేయస్వామి ఆలయ ధర్మకర్త శంకర్‌లాల్‌నాయక్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతియేటా శ్రీరామనవమి పండుగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఆలయం వద్ద ఎడ్లబండ్ల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీల్లో మొదటి బహుమతి రూ.లక్ష, రెండో బహుమతి రూ.70వేలు, మూడవబహుమతి రూ.50, నాలుగో బహుమతి రూ.40వేలుగా నిర్ణయించామన్నారు. ఏప్రిల్ 5లోపు రూ.2 వేలు చెల్లించి పేర్లు మోదు చేయించుకోవాలన్నారు. ఆయనతోపాటు జడ్పీటీసీ పాలే జయరాంనాయక్, నాగేనాయక్, గంపల రమణారెడ్డి, శివారెడ్డి, రాజే్‌షనాయక్, వాసునాయక్, నారాయణస్వామి పాల్గొన్నారు.