Home » Penukonda
సాంస్కృతిక పునర్జీవనం, పునర్వికాసం ప్రస్తుత సమాజంలో ఎంతైనా అవసరం ఉందని అరసం జాతీయ అధ్యక్షుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ సంక్షేమ, చేనేత జౌళిశాఖల మంత్రి సవిత అన్నారు.
రాజ్యసభలో అంబేడ్కర్ పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమితషా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆయన మంత్రి పదవితోపాటు పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బహుజన చైతన్యవేదిక అధ్యక్షుడు శివరామక్రిష్ణ డిమాండ్ చేశారు.
మండలంలోని రాంపురం సమీపంలో గల మహాత్మ జ్యోతిబాఫూలే (ఎంజీపీ) బాలికల గురుకుల పాఠశాలలో కలుషితాహారం తిని, 13 మంది విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు.
పట్టణ పరిధిలో మహిళా పారిశ్రామిక వాడ, స్టిచ్చింగ్ యూనిట్ ఏర్పాటు చేసి, ఆర్థికంగా చితికిపోయిన చేనేత కుటుంబాలకు ఉపాధి కల్పించాలని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీరామ్.. పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, బీసీ సంక్షేమ, చేనేత జౌళిశాఖ మంత్రి సవితకు విజ్ఞప్తిచేశారు.
కూటమి ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని రాష్ట్ర సెర్ప్, ఎంఎ్సఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఆయన ఎంఎ్సఎంఈ సెర్ఫ్ పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
‘ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కేసు వద్దు రాజీ అవుతామని చెప్పినా ఉద్దేశ్యపూర్వకంగా కుటుంబాన్ని వేధిస్తూ రాత్రంతా ఓ రైతును ఆసుపత్రికి పంపకుండా పోలీస్ స్టేషనలో పెట్టడం దారుణం.. అక్రమ నిర్బంధాలు సరికాదు, పోలీసుల తీరు మారాలి’ అంటూ పెనుకొండ పోలీస్ స్టేషనలో వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీచరణ్ ఆదివారం పోలీసులపై చిందులు తొక్కారు.
వైసీపీ గత ఐదేళ్ల పాలనలో రోడ్లపై గుంతలకు మట్టి కూడా వేయలేకపోయిందనీ, కూటమి ప్రభుత్వం నెలల వ్యవధిలోనే కొత్త రోడ్లు వేస్తోందనీ అభివృద్ధి అంటే ఇదీ అంటూ రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేతజౌళి శాఖ మంత్రి సవిత.. వైసీపీ నాయకులు చురకలు అంటించారు.
స్థానిక మండల కాంప్లెక్స్ సమీపాన ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న పునాదిని గురువారం తొలగించారు. తహసీల్దార్ మారుతి.. వీఆర్వో మన్సూర్, వీఆర్ఏ వినోద్ తదితర సిబ్బందితో కలిసి ఎక్స్కవేటర్తో నిర్మాణాన్ని తొలగించి, చదును చేయించారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్, టాటాగ్రూప్స్ చైర్మన రతనటాటా మృతి భారతదేశానికి తీరనిలోటని ఎంపీ బీకే పార్థసారథి అన్నారు.