Govt Whip Kaalava రైతుల పక్షపాతి సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jan 03 , 2025 | 12:41 AM
రైతు పక్షపాతి సీఎం చంద్రబాబు అని, రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేస్తున్నారని, వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సూచించారు. మండలంలోని మెచ్చిరి గ్రామంలో గురువారం తహసీల్దార్ నాగ రాజు ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా కాలవ శ్రీనివాసులు పా ల్గొని మాట్లాడారు.
- రెవెన్యూ సదస్సులో ప్రభుత్వ విప్ కాలవ
రాయదుర్గంరూరల్, జనవరి 2(ఆంధ్రజ్యోతి): రైతు పక్షపాతి సీఎం చంద్రబాబు అని, రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేస్తున్నారని, వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సూచించారు. మండలంలోని మెచ్చిరి గ్రామంలో గురువారం తహసీల్దార్ నాగ రాజు ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా కాలవ శ్రీనివాసులు పా ల్గొని మాట్లాడారు.
గ్రామాల్లో రైతులు భూ సమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరిగే పని లేకుండా.. కూటమి ప్రభుత్వం గ్రామాల్లోనే రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందన్నారు. ఇందులో రైతులు సమస్యలను అధికారులకు తెలిపి పరిష్కరించుకోవాలని సూచించారు. రైతుల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నిరంతర కృషి చేస్తున్నారన్నారు. జగన ప్రవేశపెట్టిన ల్యాండ్‌టైటిలింగ్ యాక్టును అధికారంలోకి రాగానే చంద్రబాబు రద్దు చేశారని తెలిపారు. సూపర్ సిక్స్‌లో భాగంగా ఉగాది నుంచి మహిళలకు ఉచితబస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ కొండన్న, టీడీపీ మండల కన్వీనర్ హనుమంతు, సర్పంచ వన్నూరుస్వామి, నాయకులు సదాశివారెడ్డి, కాటా వెంకటేశులు, సోమశేఖర్, మల్లికార్జున, తిమ్మారెడ్డి, భీమయ్య, మనోహర్‌నాయుడు, లచ్చన్నచౌదరి, గోవిందరాజులు, హనుమంతు, జనార్ధన, బట్టి తిప్పేస్వామి, నీలప్ప, తిప్పయ్య, సిద్ధప్ప, జోగప్ప పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....