Share News

collector సారాకు దూరంగా ఉండాలి

ABN , Publish Date - Mar 05 , 2025 | 11:50 PM

నాటు సార మహ్మమారికి దూరంగా ఉండి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కలెక్టర్‌ టీఎస్‌ చేతన పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌ ఆవరణంలో బుధవారం జిల్లా ప్రోబిషన అండ్‌ ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో నాటుసారా నిర్మూలనపై నవోదయం 2.0కార్యక్రమానికి సంబంధించి ఏర్పాటు చేసి ప్రచార రథాన్ని కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు.

collector సారాకు దూరంగా ఉండాలి
ప్రచార రథాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ టీఎస్‌ చేతన

కలెక్టర్‌ టీఎస్‌ చేతన

పుట్టపర్తిటౌన, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): నాటు సార మహ్మమారికి దూరంగా ఉండి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కలెక్టర్‌ టీఎస్‌ చేతన పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌ ఆవరణంలో బుధవారం జిల్లా ప్రోబిషన అండ్‌ ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో నాటుసారా నిర్మూలనపై నవోదయం 2.0కార్యక్రమానికి సంబంధించి ఏర్పాటు చేసి ప్రచార రథాన్ని కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ నాటుసారా నిర్మూలనకు ప్రభుత్వం నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. నాటుసారా వలన జరిగే అనర్థాలపై కళాబృందం ఆధ్వర్యంలో చైతన్య రథం గ్రామాల్లో తిరిగి ప్రజలను చైతన్య పరుస్తుందన్నారు. ప్రజలు కూడా ఎక్సైజ్‌ సిబ్బందికి సహకరించి, నాటుసారా నిర్మూలనకు సహకరించాలని కలెక్టర్‌ కోరారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, జిల్లాలో నాటుసారా నిర్మూలన చేయాలని ఆదేశించారు. ఈకార్యక్రమంలో ఎక్సైజ్‌ శాఖ సీఐ, ఎస్‌ఐ, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 05 , 2025 | 11:50 PM