Share News

cpi కర్షకులు, కార్మికులకు అండ ఎర్రజెండా

ABN , Publish Date - Jan 06 , 2025 | 12:40 AM

కర్షకులు, కార్మికులకు అండ ఎర్రజెండా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. కుందుర్పి మండలంలోని బెస్తరపల్లిలో ఆదివారం సీపీఐ శతవార్షికోత్సవాల్లో భాగంగా అమరవీరు ల స్థూపాన్ని ఆవిష్కరించారు.

cpi కర్షకులు, కార్మికులకు అండ ఎర్రజెండా
ర్యాలీగా వెళ్తున్న రామకృష్ణ, జగదీష్‌ తదితరులు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

కళ్యాణదుర్గం రూరల్‌/కుందుర్పి, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): కర్షకులు, కార్మికులకు అండ ఎర్రజెండా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. కుందుర్పి మండలంలోని బెస్తరపల్లిలో ఆదివారం సీపీఐ శతవార్షికోత్సవాల్లో భాగంగా అమరవీరు ల స్థూపాన్ని ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల శిలాఫలకం, సీపీఐ కార్యాల యం, గ్రంథాలయాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, పార్టీ కార్యకర్తలు తప్పెట్లు, ఉరుములు, చెక్కభజనలతో సీపీఐ నాయకులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ దున్నేవాడిదే భూమి అన్న నినాదంతో పోరాడిన గ్రామాల్లో బెస్తరపల్లి ఒకటని కొనియాడారు. ఇలాంటి పోరాటాల ఫలితంగా నియోజకవర్గంలోని దాదాపు 50 వేల ఎకరాలకు పైగా పేద ప్రజలకు పంచామన్నారు.

సమాజ శ్రేయస్సు కోసం పని చేయని కూటమి ప్రభుత్వం

కూటమి ప్రభుత్వం సమాజ శ్రేయస్సు కోసం పనిచేయకుండా సినీ నిర్మాతలు, బడా హీరోల కోసమే పనిచేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. పక్కా రాష్ట్రం తెలంగాణలో బెనిఫిట్‌ షోలకు టికెట్ల ధరలను పెంచబోమని చెబితే, ఇక్కడ ఆంధ్రప్రదేశ ఉపముఖ్యమంత్రి పవన కళ్యాణ్‌ మాత్రం పెంచుతామని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడం కాని, వారి సంక్షేమం గురించి గాని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించడం లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్‌, పార్టీ జిల్లా కార్యదర్శి జాఫర్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎండీ సంజీవప్ప, నియోజకవర్గ కార్యదర్శి గోపాల్‌, సీపీఐ పట్టణ కార్యదర్శి ఓంకార్‌ యాదవ్‌, సీపీఐ నాయకులు, ఏఐఎ్‌సఎఫ్‌ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2025 | 12:40 AM