CPM: సీపీఎం నేత బడా సుబ్బిరెడ్డి కన్నుమూత
ABN , Publish Date - Feb 25 , 2025 | 12:01 AM
సీపీఎం సీనియర్ నేత బడా సుబ్బిరెడ్డి (66) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. అనారోగ్యంతో కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొం దుతూ మృతిచెందారని ఆ పార్టీ నాయకులు తెలిపారు.

నివాళి అర్పించిన నాయకులు
కదిరి అర్బన, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): సీపీఎం సీనియర్ నేత బడా సుబ్బిరెడ్డి (66) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. అనారోగ్యంతో కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొం దుతూ మృతిచెందారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామమైన కదిరి మండలంలోని వరిగిరెడ్డిపల్లికి తీసుకొచ్చారు. పలువురు ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. సుబ్బిరెడ్డి మృతి కమ్యూనిస్టు ఉద్యమలకు తీరని లోటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్, సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్యయాదవ్ తదితరులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సుబ్బిరెడ్డి మృతి సీపీఎంకు, రైతు సంఘానికి తీరని లోటని అన్నారు. సుదీర్ఘకాలంగా రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై అనేక ఉద్యమాలు కొనసాగించారని గుర్తు చేసుకున్నారు. సీపీఎం సత్యసాయి జిల్లా కార్యదర్శి వర్గసభ్యుడిగా, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నట్లు తెలిపారు. బడుగు, బలహీనవర్గాల కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై, ఎన్పీకుంటలో సోలార్ కంపెనీ ఏర్పాటు సమయంలో రైతుల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు చేశారని పేర్కొన్నా రు. ఆయన పోరాటాలు, ఉద్యమాలు స్ఫూర్తిదాయకం అన్నారు. మృతుడి కు టుంబాన్ని పలువురు పరామర్శించారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శులు కేశవరెడ్డి, కదిరప్ప, సీపీఎం నాయకు డు జీఎల్ నరసింహులు, పలువురు నాయకులు నివాళి అర్పించారు.