Farmer's welfare రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: విప్ కాలవ
ABN , Publish Date - Jan 12 , 2025 | 12:48 AM
రైతు సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. మండలంలోని గలగల పంచాయతీ పైదొడ్డి గ్రామంలో నిర్మాణం పూర్తయిన సీసీరోడ్లు, ఐదు గోకులంషెడ్లను శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి, గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు.
గుమ్మఘట్ట, జనవరి 11(ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. మండలంలోని గలగల పంచాయతీ పైదొడ్డి గ్రామంలో నిర్మాణం పూర్తయిన సీసీరోడ్లు, ఐదు గోకులంషెడ్లను శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి, గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు.
పాడి రైతులు గోకు లం షెడ్లను వినియోగించుకోవాలని సూచించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఇసుమంత అభివృద్ధి కూడా జరగలేదని విమర్శించారు. కూటమి వచ్చాక మళ్లీ అభివృద్ధి పనులు సాగుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జనసేన ఇనచార్జి మంజునాథ్‌గౌడ్, టీడీపీ మండల కన్వీనర్ గిరిమల్లప్ప, క్లస్టర్ కన్వీనర్ కాలవ సన్నన్న, మత్స్యశాఖ సంఘం అధ్యక్షుడు శ్రీరాములు, సర్పంచు లు శివకుమార్, నాగరాజు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..