Share News

Collector రైతుల అభ్యున్నతికే గోకులం షెడ్లు: కలెక్టర్‌

ABN , Publish Date - Jan 13 , 2025 | 01:01 AM

రైతుల అభ్యున్నతి కోసమే ప్రభుత్వం గోకులం షెడ్లను మంజూరు చేసిందని, లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ సూచించారు. మండలంలోని అంకంపల్లిలో ఆదివారం జరిగిన పల్లెపండుగ వారోత్సవాల్లో ఆయన పాల్గొని గోపూజలు చేసి గోకులం షెడ్లను ప్రారంభించారు.

  Collector  రైతుల అభ్యున్నతికే గోకులం షెడ్లు: కలెక్టర్‌

బెళుగుప్ప, జనవరి 12(ఆంధ్రజ్యోతి): రైతుల అభ్యున్నతి కోసమే ప్రభుత్వం గోకులం షెడ్లను మంజూరు చేసిందని, లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ సూచించారు. మండలంలోని అంకంపల్లిలో ఆదివారం జరిగిన పల్లెపండుగ వారోత్సవాల్లో ఆయన పాల్గొని గోపూజలు చేసి గోకులం షెడ్లను ప్రారంభించారు.


తర్వాత స్థానిక ఉన్నత పాఠశాలలో టీడీపీ నాయకులు నరేంద్ర, పురుషోత్తమ్‌, ఈశ్వరయ్య శ్రీనివాసులు, ఎంపీడీవో లక్ష్మీనారాయణ, ఎంఈవో మల్లారెడ్డి, ఏవో పృథ్వీసాగర్‌, సూర్యప్రకాష్‌ తదితరులతో కలిసి మొక్కలు నాటారు. తర్వాత రైతులనుద్దేశించి మాట్లాడుతూ.. పశుపోషణతో ఎంతో ఆదాయం చేకూరుతుందన్నారు. జిల్లాకు 1627 గోకులం షెడ్లు మంజూరు కాగా.. ఇప్పటివరకు 600 షెడ్లు నిర్మాణం పూర్తయ్యాయన్నారు. త్వరలోనే లక్ష్యాన్ని పూర్తి చేసి జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు లబ్ధిదారులు, అధికారులు సమష్టిగా కృషి చేయాలని కోరారు. ఎంపీపీ పెద్దన్న, సర్పంచ, ఎంపీటీసీ, టీడీపీ నాయకులు రాధాకృష్ణ, తి మ్మప్ప, విరుపాపల్లి రాధాకృష్ణ, సునిల్‌ దబ్బర లక్ష్మీనారాయణ, బాలాజీ, శ్రీనివాసులు, వన్నూరుస్వామి, ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Jan 13 , 2025 | 01:01 AM