TELUDU DAY: ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
ABN , Publish Date - Feb 22 , 2025 | 12:06 AM
పట్టణంలోని వివేకానంద డిగ్రీ కళాశాలలో శుక్రవారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ధర్మవరం, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని వివేకానంద డిగ్రీ కళాశాలలో శుక్రవారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కరస్పాండెంట్ బాస్కర్‌రెడ్డి, డైరెక్టర్ బాలం లక్ష్మీనారాయణరెడ్డి, ప్రిన్సిపాల్ కరణం హర్షవర్దన గాంధీ, గిడుగు రామ్మూర్తి పంతులు చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.
నంబులపూలకుంట : మండలంలోని గూటిబైలు జడ్పీ పాఠశాలలో శుక్రవారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవనిఇ్న ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలు శాంతమ్మ, ఉపాధ్యాయులు నాగరాజునాయక్, చిన్నా, మహబూబ్‌బాషా, చాంద్‌బాషా, స్రవంతి పాల్గొన్నారు.
కదిరిఅర్బన: మండలంలోని ఎరుకులవాండ్లపల్లి వద్ద ఉన్న హరీష్ పాఠశాలలో శుక్రవారం మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ ఎంఎస్ కిరణ్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఓబుళదేవరచెరువు: మండలంలోని పలు ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో శుక్రవారం మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జ్ఞానసాయి పాఠశాలలో భారత మాత, సరస్వతి చిత్రపటానికి పూలమాలలు వేసి, ప్రత్యేక పూజలు చేశారు. అలాగే వశిష్ట, శ్రీవిజ్ఞాన సీబీఎ్‌ససీ, విజ్ఞాన, రైయినబో పాఠశాలలో నిర్వహించారు. కరస్పాండెంట్లు ఫకృద్దీన, మస్తాన, మోహనరెడ్డి, శివశంకర్‌రెడ్డి, జయసింహారెడ్డి, పాల్గొన్నారు.