Share News

COLLECTOR: లింగ నిర్ధారణ చేస్తే జైలుకే

ABN , Publish Date - Jan 05 , 2025 | 12:00 AM

చట్ట విరుద్ధంగా గర్భస్థ లింగ నిర్ధారణ చేసేవారిని జైలుకు పంపాలని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ వైద్యాధికారులను ఆదేశించారు. లింగనిర్ధారణ నిషేధిత చట్టం అమలుపై కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి కమిటీతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

COLLECTOR: లింగ నిర్ధారణ చేస్తే జైలుకే
Collector Vinod Kumar speaking in the review

కలెక్టరు వినోద్‌కుమార్‌

అనంతపురం టౌన, జనవరి 4(ఆంధ్రజ్యోతి): చట్ట విరుద్ధంగా గర్భస్థ లింగ నిర్ధారణ చేసేవారిని జైలుకు పంపాలని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ వైద్యాధికారులను ఆదేశించారు. లింగనిర్ధారణ నిషేధిత చట్టం అమలుపై కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి కమిటీతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టరు మాట్లాడుతూ గర్భస్థ లింగ నిర్ధారణ నివారణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. తొలుత ఈచట్టంపై అవగాహన పెంచడానికి విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లాలో స్కానింగ్‌ సెంటర్లపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. స్కానింగ్‌చేసి, ఆడపిల్ల ఉంటే అబార్షన చేస్తున్నారనే ఆరోపణలున్న వారిని ఆధారాలతో పట్టుకుని, చట్టప్రకారం శిక్ష పడేలా చూడాలన్నారు. వైద్యాధికారులు, జిల్లాకమిటీతోను, ఇతరశాఖల అధికారులతో సమన్వ యం చేసుకుని చట్టాన్ని అమలు చేయాలన్నారు. ఆడపిల్ల ప్రాముఖ్యత గురించి ప్రజలు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా అదనపు కోర్టు న్యాయాధికారి శోభారాణి మాట్లాడుతూ లింగ నిర్ధారణ నివారణ చట్టం అమలుకు లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ అవసరమైన సహకారం అందిస్తుందన్నారు. సమావేశంలో డీఎంహెచఓ డాక్టరు ఈబీదేవి, గైనకాలజీ విభాగాధికారి డాక్టరు షంషాద్‌బేగం, పోలీ్‌సశాఖ సీఐ వెంకటేశ్వర్లు, ఆర్డీటీ హెల్త్‌ డైరెక్టరు డాక్టరు దుర్గేష్‌, రెడ్స్‌ భానుజా, డెమో త్యాగరాజు, గంగాధర్‌, వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

స్వయం ఉపాధికి రుణాలు ఇవ్వండి

స్వయం ఉపాధికి సంబంధించిన పథకాలకు లక్ష్యం మేరకు రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను కలెక్టరు ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం ఆయన బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. కలెక్టరు మాట్లాడుతూ బీసీయాక్షన ప్లాన కింద స్వయం ఉపాధి పథకం ద్వారా జిల్లాకు 1728యూనిట్లు మంజూరయ్యాయన్నారు. జిల్లాలో 13 బ్యాంకుల పరిధిలో యూనిట్‌ల కింద అర్హులైన లబ్ధిదారులకు రుణాలు ఇవ్వాలని సూచించారు. రూ.రెండు లక్షలు విలువ కలిగిన యూనిట్‌లు 1228ఉండగా, రూ. రెండు లక్షల నుంచి రూ. మూడు లక్షలు విలువ ఉన్న యూనిట్లు 368 ఉన్నాయ న్నారు. రూ. మూడు లక్షల నుంచి రూ.ఐదు లక్షలు విలువ చేసే యూనిట్‌లు 132 జిల్లాకు మంజూరయ్యాయన్నారు. ఆయా బ్యాంకులకు కేటాయించిన లక్ష్యాలను చిత్తశుద్ధితో పూర్తి చేయాలని సూచించారు. ఈనెల 8నుంచి 16వరకు ఆనలైనలో సైట్‌ ఓపెన అవుతుందని మీసేవ, సచివాలయాలలో అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టరు తెలిపారు.

జిల్లాకు 72 జనరిక్‌ మందుల షాపులు

జిల్లాకు కొత్తగా 72 జనరిక్‌ మందుల షాపులు మంజూరైనట్లు కలెక్టరు వినోద్‌కుమార్‌ తెలిపారు. ఈబీసీ నిరుద్యోగ యువతకు ఈషాపులు కేటాయిస్తామన్నారు. ఈషాపు విలువ రూ.8లక్షలు ఉండగా అందులో రూ.4లక్షలు సబ్సిడీ పోగా బ్యాంకు రూ.4లక్షలు రుణం ఇస్తుందన్నారు. అర్హత కలిగిన బీసీ, ఈబీసీ యువత ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టరు కోరారు. సమావేశంలో బీసీ కార్పొరేషన ఈడీ సుబ్రహ్మణ్యం, ఎల్డీఎం నర్సింగరావు, జిల్లా వ్యవసాయశాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ, ఫిషరీష్‌ డీడీ శ్రీనివాసనాయక్‌, డీసీసీబీ సీఈఓ సురేఖారాణి పలు బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2025 | 12:00 AM