TDP: చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం
ABN , Publish Date - Feb 22 , 2025 | 12:11 AM
మండలకేంద్రం లో శుక్రవారం సీఎం చంద్రబాబు చిత్రపటానికి రైతులు క్షీరాభిషేకం చేశారు.

తనకల్లు, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): మండలకేంద్రం లో శుక్రవారం సీఎం చంద్రబాబు చిత్రపటానికి రైతులు క్షీరాభిషేకం చేశారు. టమోటా ధరలు పడిపోయి రైతులు పొలాల్లో వదిలేస్తున్నారని, ఇలాంటి సమయంలో రైతుల ను ఆదుకోవడనికి ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మం త్రి అచ్చెన్నాయుడు ప్రభుత్వమే టమోటాలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవడం హర్షించదగ్గ విషయమన్నారు. టీడీపీ కన్వీనర్ తొట్లి రెడ్డిశేఖర్‌రెడ్డి, దేశాయి ప్రభాకర్‌రెడ్డి, రెడ్డెప్పరెడ్డి, దస్తగిరి, మహబూబ్‌బాషా, కోటిరెడ్డి, తోట సరోజమ్మ పాల్గొన్నారు.