MLA SINDHURA: ప్రజారక్షణలో పోలీస్ మార్క్ కనిపించాలి
ABN , Publish Date - Jan 03 , 2025 | 12:38 AM
నూతనసంవత్సరంలో న్యాయంకోసం పోలీసుస్టేషన్లకు వచ్చే ప్రజల సమస్యలకు పరిష్కారం చూపి, పోలీస్ మార్కు కనిపించాలని ఎమ్మెల్యే పల్లె సిందూరరెడ్డి పోలీసు అధికారులకు సూచించారు.
పుట్టపర్తిరూరల్, జనవరి 2(ఆంధ్రజ్యోతి): నూతనసంవత్సరంలో న్యాయంకోసం పోలీసుస్టేషన్లకు వచ్చే ప్రజల సమస్యలకు పరిష్కారం చూపి, పోలీస్ మార్కు కనిపించాలని ఎమ్మెల్యే పల్లె సిందూరరెడ్డి పోలీసు అధికారులకు సూచించారు. గురువారం అనంతపురంలోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యేను కలిసిన పోలీసు అధికారులు ఎమ్మెల్యే, మాజీమంత్రి పల్లెరఘనాథరెడ్డికి పూలమొక్కలను అందచేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలు శాంతియుత జీవనం గడిపేలా పోలీసులు కృషి చేయాలన్నారు. న్యాయం కోసం పోలీసుస్టేషనకు వచ్చే ప్రజల పట్ల సహృదయంతో వ్యవహరించి న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఎమ్మెల్యే భర్త పల్లె వెంకటకృష్ణ కిశోర్‌రెడ్డి, ఎమ్మెల్యే కేరళ మాజీ డీజీపీ శంకరరెడ్డి, అడిషనల్ ఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, డీఎస్పీ విజయ్‌కుమార్, సీఐలు సునీత, నరేంద్రరెడ్డి, సురేష్, ఇందిర, ఎస్సైలు లింగన్న, మల్లికార్జునరెడ్డి, వెంకటనారాయణ, దాదాపీర్, కృష్ణమూర్తి, శ్రీరామలు, సూర్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.