Share News

Railway Road ప్రగతి మార్గం

ABN , Publish Date - Jan 09 , 2025 | 12:58 AM

సీఎం చంద్రబాబు చొరవతో అనంతలో రైల్వే, రోడ్డు మార్గాల అభివృద్ధి వేగవంతం అయింది. విశాఖ నుంచి ప్రధాని మోదీ బుధవారం వర్చువల్‌గా రాష్ట్రంలో ప్రారంభించిన, శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనుల్లో జిల్లాలోని రహదారులు, రైల్వే లైన్లు ఉండటం విశేషం.

Railway Road ప్రగతి మార్గం

రోడ్డు, రైలు మార్గాలకు మహర్దశ

విశాఖ నుంచి ప్రారంభోత్సవం,

శంకుస్థాపన

సీఎం చంద్రబాబు చొరవ..

పీఎం మోదీ వరాలు

గుంతకల్లు, జనవరి 8(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు చొరవతో అనంతలో రైల్వే, రోడ్డు మార్గాల అభివృద్ధి వేగవంతం అయింది. విశాఖ నుంచి ప్రధాని మోదీ బుధవారం వర్చువల్‌గా రాష్ట్రంలో ప్రారంభించిన, శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనుల్లో జిల్లాలోని రహదారులు, రైల్వే లైన్లు ఉండటం విశేషం. గుంతకల్లు రైల్వే డివిజనలోని గుత్తి-పెండేకల్లు బైపాస్‌ లైన సెక్షనను రూ.350 కోట్లతో చేపట్టే డబ్లింగ్‌ పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ మార్గం డబుల్‌ అయితే బెంగళూరు-విజయవాడ, బెంగళూరు-హైదరాబాదు మార్గాలలో ప్రయాణం వేగవంతం అవుతుంది. ఈ లైనలలో ప్రయాణించే రైళ్లు వేగాన్ని పుంజుకుంటాయి. 2016లో ఎన్డీయే ప్రభుత్వ హయాంలో రూ.998 కోట్లతో చేపట్టిన గుత్తి-ధర్మవరం రైల్వే లైన డబ్లింగ్‌ పనులు పూర్తి అయ్యాయి. ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. బెంగళూరు-హైదరాబాద్‌, హైదరాబాదు-తిరుపతి, హైదరాబాదు-విజయవాడ రైళ్ల వేగాన్ని పెంచేందుకు వీలుగా చేపట్టనున్న మహబూబ్‌నగర్‌-కర్నూలు-డోన లైన డబ్లింగ్‌ పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రైల్వే డివిజనలో సరుకు రవాణా, ప్రయాణికుల చేరవేత పరంగా ఎంతో పురోగతి సాధ్యపడుతుంది. రోడ్డు రవాణాకు సైతం ప్రాధాన్యం ఇచ్చారు. రూ.160 కోట్లతో అనంతపురం-తాడిపత్రి రహదారి విస్తరణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ రహదారిని నాలుగు వరుసలకు విస్తరించి నిర్మిస్తున్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో సైతం పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. రూ.208 కోట్లతో పూర్తి చేసిన మడకశిర-శిర, రూ.536 కోట్లతో నిర్మించిన బత్తలపల్లి-ముదిగుబ్బ నాలుగు వరుసల రహదారిని ప్రారంభించారు.

Updated Date - Jan 09 , 2025 | 12:58 AM