CMRF సీఎంఆర్‌ఎఫ్‌తో నిరుపేదలకు ఊరట
ABN , Publish Date - Jan 09 , 2025 | 01:40 AM
సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్‌ఎఫ్)తో నిరుపేదలకు ఎంతో ఊరట కలుగుతోందని, అనారోగ్యంతో సతమతమవుతూ వైద్యం చేయించుకోవటానికి ఇబ్బంది పడుతున్న ఎన్నో కుటుంబాలకు ఆర్థిక చేయూత కలుగుతోందని ప్రభత్వ విప్ కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు.
- ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు
- 16మంది లబ్ధిదారుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ
రాయదుర్గం, జనవరి 8(ఆంధ్రజ్యోతి): సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్‌ఎఫ్)తో నిరుపేదలకు ఎంతో ఊరట కలుగుతోందని, అనారోగ్యంతో సతమతమవుతూ వైద్యం చేయించుకోవటానికి ఇబ్బంది పడుతున్న ఎన్నో కుటుంబాలకు ఆర్థిక చేయూత కలుగుతోందని ప్రభత్వ విప్ కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు.
నియోజకవర్గ పరిధిలోని 16 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ నుంచి సుమారు రూ. 22,75,609 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన చెక్కులను, ఎల్‌ఓసీలను పట్టణంలోని తన నివాసంలో బుధవారం కాలవ శ్రీనివాసులు లబ్ధిదారుల కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రులలో వైద్యం చేయించుకుంటున్న నిరుపేదలకు ఈ సీఎంఆర్‌ఎఫ్ ఎంతో ఊరట కలిగిస్తోందన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరయ్యే ఆర్థిక సాయం పేదల కుటుంబాల్లో వెలుగులు నింపుతోందన్నారు. ప్రతిఒక్కరూ ఈ నిధులను సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చెక్కులు అందుకున్న వారు ముఖ్యమంత్రికి, విప్ కాలవకు కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..