Share News

PULE: సావిత్రిబాయి ఫూలే ఆశయసాధనకు కృషి

ABN , Publish Date - Jan 04 , 2025 | 12:23 AM

సంఘసంస్కర్త సావిత్రిబాయి ఫూలే ఆశయసాధనకు ప్రతిఒక్కరూ కృషిచేద్దామని గైనకాలజిస్టు బాలాకుమారి పిలుపునిచ్చారు. ఫూలే జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఐద్వా, ఎస్‌ఎ్‌ఫఐ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని ఎస్‌ఆర్‌ జూనియర్‌ కళాశాలలో సదస్సు నిర్వహించారు.

PULE: సావిత్రిబాయి ఫూలే ఆశయసాధనకు కృషి
Dr. Balakumari is speaking

అనంతపురం కల్చరల్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): సంఘసంస్కర్త సావిత్రిబాయి ఫూలే ఆశయసాధనకు ప్రతిఒక్కరూ కృషిచేద్దామని గైనకాలజిస్టు బాలాకుమారి పిలుపునిచ్చారు. ఫూలే జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఐద్వా, ఎస్‌ఎ్‌ఫఐ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని ఎస్‌ఆర్‌ జూనియర్‌ కళాశాలలో సదస్సు నిర్వహించారు. ఫూలే చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో రచయిత్రి శశికళ, కళాశాల ప్రిన్సిపాల్‌ భవాని, ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా అధ్యక్షుడు సిద్దు, ఓతూరు పరమేష్‌, భీమేష్‌, చంద్రిక, అశ్విని, సాయి, మీర, అజయ్‌ పాల్గొన్నారు.

జేవీవీ ఆధ్వర్యంలో: జన విజ్ఞాన వేదిక(జేవీవీ) ఆధ్వర్యంలో శుక్రవారం మొదటిరోడ్డులోని శారద నగరపాలకోన్నత పాఠశాలలో సావిత్రిబాయి ఫూలే జయంతిని నిర్వహించారు. కార్యక్రమానికి ఇండియన మెడికల్‌ అసోసియేషన రాష్ట్ర సహాయ కార్యదర్శి డాక్టర్‌ హేమలత ముఖ్యఅతిథిగా హాజరై ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి, ఉపాధ్యాయులు రాధిక, శ్రీలత, నాగరత్నమ్మ, జేవీవీ నాయకులు రామిరెడ్డి, లక్ష్మీనారాయణ, తిరుపాలు పాల్గొన్నారు.

రామగిరి: మండలంలో సావిత్రిబాయి ఫూలే జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. నసనకోట గురుకుల పాఠశాలలో ఇనచార్జి ప్రిన్సిపాల్‌ ప్రమీల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఆదర్శప్రాయురాలు సావిత్రిబాయి ఫూలే

అనంతపురం సెంట్రల్‌ : దేశంలో తొలి ఉపాధ్యాయురాలిగా అఽక్షర జ్యోతిని వెలుగించిన సావిత్రాబాయి ఫూలే విద్యాలోకానికి ఆదర్శప్రాయురాలని ఎస్కేయూ రెక్టార్‌ ప్రొఫెసర్‌ వెంకటనాయుడు అన్నారు. శుక్రవార ఎస్కేయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రామచంద్ర అధ్యక్షతన జయంతి వేడుకలు నిర్వహించారు. రెక్టార్‌ వెంకటనాయుడు, రిజిస్ర్టార్‌ రమే్‌షబాబు, సీఈ డాక్టర్‌ లోకే్‌షతోపాటు పలువురు బోధన, బోధనేతర సిబ్బంది హాజరై ఘన నివాళులర్పించారు. అలాగే బహుజన లాయర్స్‌ ఫోరం(బీఎల్‌ఎఫ్‌) ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలుర వసతి గృహం-2లో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర అధ్యక్షుడు నారాయణప్ప, అడ్వకేట్‌ ప్రమీల, వినోద్‌, గణేష్‌, వార్డన లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

టీడీపీ నాయకుల నివాళి

అనంతపురం అర్బన: సావిత్రిబాయి ఫూలే జయంతిని పురస్కరించుకొని శుక్రవారం స్థానిక టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆమె చిత్రపటానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌ చౌదరి, ఇతర నాయకులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో తలారి ఆదినారాయణ, ముంటిమడుగు కేశవరెడ్డి, సరిపూటి రమణ, కృష్ణకుమార్‌, పోతుల లక్ష్మీనరసింహులు, శ్రీనివాసులు చౌదరి, స్వామిదాస్‌, నారాయణస్వామి యాదవ్‌, కురుబ నారాయణస్వామి, రాంబాబు పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2025 | 12:23 AM