Share News

Sri Satya Sai సంబరం.. అబ్బురం

ABN , Publish Date - Jan 12 , 2025 | 12:05 AM

పుట్టపర్తిలోని హిల్‌ వ్యూ స్టేడియంలో సత్యసాయి విద్యార్థులు స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ మీట్‌ అబ్బురపరిచింది. సత్యసాయి చిత్రపటాన్ని కారులో ఊరేగిస్తూ విద్యార్థులు బ్రాస్‌ బ్యాండ్‌తో శనివారం ఉదయం స్టేడియంకు చేరుకున్నారు. వేదికపైన సత్యసాయి చిత్రపటాన్ని ఉంచి పూజలు చేశారు.

Sri Satya Sai సంబరం.. అబ్బురం
స్పోర్ట్స్‌మీట్‌లోని ఓ దృశ్యం

సాయి విద్యార్థుల స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ మీట్‌

సందర్శకులతో కిక్కిరిసిన హిల్‌ వ్యూ స్టేడియం

సత్యసాయి శత జయంతి వేడుకలు ప్రారంభం

పుట్టపర్తి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): పుట్టపర్తిలోని హిల్‌ వ్యూ స్టేడియంలో సత్యసాయి విద్యార్థులు స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ మీట్‌ అబ్బురపరిచింది. సత్యసాయి చిత్రపటాన్ని కారులో ఊరేగిస్తూ విద్యార్థులు బ్రాస్‌ బ్యాండ్‌తో శనివారం ఉదయం స్టేడియంకు చేరుకున్నారు. వేదికపైన సత్యసాయి చిత్రపటాన్ని ఉంచి పూజలు చేశారు. అనంతరం ప్రశాంతి నిలయం, అనంతపురం, బెంగళూరు బృందావనం, నందిగిరి విద్యార్థులు మంగళ వాయిద్యాలతో సత్యసాయి చిత్రపటానికి వందన సమర్పణ చేశారు. అనంతరం యూనివర్సిటీ జెండాను ఆవిష్కరించి, క్రీడాజ్యోతిని వెలిగించారు. సత్యసాయి స్పోర్ట్స్‌ మీట్‌తో బాబా శత జయంతి వేడుకలు ప్రారంభమైనట్లు ట్రస్టు ప్రతినిధులు ప్రకటించారు. విద్యార్థులు మొదట ‘దశావతారం.. కలియుగంలో సత్యసాయి అవతారం’ పేరిట సంగీత, నృత్య ప్రదర్శన చేశారు. యుగావతార గరుడ వాహనం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. విద్యార్థుల రోప్‌ విన్యాసాలు, కారుపై జంపింగ్‌, మండుతున్న గోళంలో బైక్‌ జంపింగ్‌లు అబ్బురపరిచాయి. ఈశ్వరమ్మ పాఠశాల హయ్యర్‌ సెకండరీ బంృదావనం, నందిగిరి విద్యార్థినుల ఆటల పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈశ్వరమ్మ పాఠశాల విద్యార్థులు సైకిళ్లపై చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి. డీఎస్పీ విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటుచేశారు. స్పోర్ట్స్‌ మీట్‌ను తిలకించడానికి వేలాది మంది తరలివచ్చారు. స్పోర్ట్స్‌ మీట్‌లో సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌, శ్రీసత్యసాయి గ్లోబల్‌ ట్రస్టు చైర్మన చక్రవర్తి, ట్రస్టు సభ్యులు నాగానందం, సత్యసాయి యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ రాఘవేంద్రప్రసాద్‌, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2025 | 12:05 AM