MLA KANDIKUNTA: మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి
ABN , Publish Date - Mar 08 , 2025 | 11:47 PM
మహిళల ఆర్థిక స్వావలంబనకు టీడీపీ కృషి చేస్తోందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. శనివారం స్థానిక పీవీఆర్ గ్రాండ్‌లో మెప్మా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు.

కదిరి, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): మహిళల ఆర్థిక స్వావలంబనకు టీడీపీ కృషి చేస్తోందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. శనివారం స్థానిక పీవీఆర్ గ్రాండ్‌లో మెప్మా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారిత, స్వావలంబన కోసం కృషి చేస్తోందన్నారు. ఎన్టీరామారావు మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. మహిళలు ఆర్థికాభివృద్ధి చెందడానికి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబానాయుడు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి అభివృద్ధి చేశారన్నారు. నేడు ఎన్నో రంగాల్లో డ్వాక్రామహిళలు రాణిస్తున్నట్లు చెప్పారు. అనంతరం పలువురు మహిళలను సన్మానించారు. కార్యక్రమానికి ఆర్డీవో వీవీఎస్ శర్మ అధ్యక్షత వహించారు. ఆర్డీవో సతీమణి, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అరుణమ్మ ప్రత్యేక గీతాన్ని ఆలపించారు. మున్సిపల్ కమిషనర్ కిరణ్‌కుమార్, ఎంపీడీఓ పోలప్ప, ఎంఈఓలు చెన్నక్రిష్ణ, ఓబులరెడ్డి, మెప్మా సిబ్బంది గిరి, మాధవి, శ్రీనివాసులు, టీడీపీ నాయకులు బాహుద్దీన, డైమండ్ ఇర్షాన, అల్ఫా ముస్తఫా, రాజేంద్రనాయుడు, సావిత్రమ్మ, పీట్ల రమణమ్మ, గంగరత్నమ్మ పాల్గొన్నారు.