Taticherla ‘నోటి దురుసు’పై అదే ప్రేమ..!
ABN , Publish Date - Jan 09 , 2025 | 12:56 AM
కూటమి ప్రభుత్వం, విధానాలపై విమర్శలతో విరుచుకుపడిన వైఎ్‌సఆర్‌టీఏ నాయకుడు అశోక్‌పై విద్యాశాఖాధికారులు అదే ప్రేమ చూపుతున్నారు. గత నెల 7న ప్రభుత్వ కార్యక్రమం మెగా పీటీఎంపై అవాకులు పేలిన అశోక్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేక విమర్శలకు తావిస్తోంది.
కూటమిప్రభుత్వంపై విమర్శలు
గత నెల 7న మెగా పీటీఎంపై అవాకులు
విచారణ పేరుతో డీవైఈఓ తీవ్ర జాప్యం
ఆరా తీసిన కమిషనర్, ఆర్‌జేడీ ..?
నేడు జిల్లాకు విద్యాశాఖమంత్రి లోకేశ రాక
అనంతపురం విద్య, జనవరి 8(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం, విధానాలపై విమర్శలతో విరుచుకుపడిన వైఎ్‌సఆర్‌టీఏ నాయకుడు అశోక్‌పై విద్యాశాఖాధికారులు అదే ప్రేమ చూపుతున్నారు. గత నెల 7న ప్రభుత్వ కార్యక్రమం మెగా పీటీఎంపై అవాకులు పేలిన అశోక్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేక విమర్శలకు తావిస్తోంది. చర్యల నుంచి తప్పించేందుకు అధికారులు యత్నాలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందు కోసమే విచారణ పేరుతో డిప్యూటీ డీఈఓ తీవ్ర జాప్యం చేశారన్న విమర్శలు ఉన్నాయి. దీనిపై విద్యాశాఖ కమిషనర్, ఆర్‌జేడీ సైతం ఆరా తీసినట్టు సమాచారం. గురువారం విద్యాశాఖ మంత్రి లోకేశ జిల్లాకు రానున్న నేపథ్యంలో దీనిపై ప్రస్తుతం ఆ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
నెల కిందట జరిగితే...
కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం గత నెల 7న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం) నిర్వహించింది. స్కూళ్లలో మంచి వాతావరణం తేవడం కోసం, విద్యార్థుల ప్రగతిపై తల్లిదండ్రుల్లోనూ అవగాహన కల్పించడానికి ఈ వేడుక నిర్వహించారు. అనంతపురం రూరల్ మండలం తాటిచెర్ల స్కూలులో పనిచేసే టీచర్, వైఎ్‌సఆర్‌టీఏ నాయకుడు అశోక్‌కు, స్థానిక విద్యార్థుల తల్లిదండ్రులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆయన విధులకు సరిగ్గా హాజరుకాకపోవడం, నాడు-నేడు పనుల్లో అవకతవకలపై అదే రోజు గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆయన మెగా పీటీఎంపై నోరుపారేసుకున్నారు. ‘పేరెంట్స్‌కు అన్నం పెట్టేందుకు 10 వేలు ఇచ్చారా..? యా గవర్నమెంట్ ఇచ్చింది..? ఎంత ఇచ్చింది..? చెప్పండి..’ అంటూ క్లాస్ రూంలోనే రెచ్చిపోయారు. ‘ఏం చికెన్లు, పొట్టేళ్లు కోసి పెడతారా..? ఏందో అంతా ఓవరాక్షన’ చేస్తున్నారంటూ అంటూ దూసురుగా తల్లిదండ్రులు, పిల్లలపై రెచ్చిపోయారు. ఈ ఘటన జరిగి నెల గడిచినా....అధికారులు మాత్రం అదే నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. దీనిపై వెంటనే రిపోర్ట్ ఇవ్వాలంటూ డిప్యూటీ డీఈఓను ఆదేశించినా.... ఆయన జాప్యం చేస్తూ...డిసెంబర్ చివరి వారంలో నివేదిక ఇచ్చారు. అశోక్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేలా నివేదిక ఇచ్చినట్లు విద్యాశాఖవర్గాల ద్వారా తెలుస్తోంది. కమిషనర్ విజయరామరాజు సైతం ఇటీవల ఆర్‌జేడీ శామ్యూల్‌ను ఈ అంశంపై ఆరా తీసినట్టు సమాచారం. జిల్లా విద్యాశాఖాధికారులు మాత్రం చర్యలకు అడుగు ముందుకేయడం లేదు. దీనిపై బుధవారం ఆంధ్రజ్యోతి డీఈఓ ప్రసాద్‌బాబును ప్రశ్నించగా... డిప్యూటీ డీఈఓ నుంచి నివేదిక వచ్చిందన్నారు. త్వరలో ఆ నివేదికను పరిశీలిస్తామని చెప్పుకొచ్చారు. గురువారం విద్యాశాఖ మంత్రి నారా లోకేశ జిల్లాకు రానున్ననేపథ్యంలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. మరి ఆయనపై చర్యలు తీసుకుంటారా...దాటవేస్తారో చూడాలి.