Share News

Women's concern రేషన బియ్యం కోసం మహిళల ఆందోళన

ABN , Publish Date - Jan 03 , 2025 | 12:48 AM

రేషన బియ్యం సక్రమంగా అందడం లేదంటూ పట్టణంలోని 10వ వార్డు మహిళలు స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద గురువారం ఆందోళన నిర్వహించారు.

Women's concern రేషన బియ్యం కోసం మహిళల ఆందోళన

ఉరవకొండ, జనవరి 2(ఆంధ్రజ్యోతి): రేషన బియ్యం సక్రమంగా అందడం లేదంటూ పట్టణంలోని 10వ వార్డు మహిళలు స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద గురువారం ఆందోళన నిర్వహించారు.


కార్యాలయం ఎదుట బైఠాయించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆరునెలలుగా తమకు రేషన బియ్యం అందడం లేదని వాపోయారు. రేషన సరుకుల కోసం పనులను మానుకుని తిరగాల్సి వస్తోందన్నారు. స్టోర్లు దగ్గర వేయరు, రేషన బండ్లు కూడా రావడం లేదని అన్నారు. రేషన బియ్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు ఎవరూ లేకపోవడంతో ఫోనలో సీఎ్‌సడీటీ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jan 03 , 2025 | 12:48 AM