Share News

SP RATNA : నూతనోత్సాహంతో పనిచేయాలి

ABN , Publish Date - Jan 03 , 2025 | 12:34 AM

నూతన సంవత్సరంలో నూతనోత్సాహంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలందించాలని ఎస్పీ రత్న పోలీసు అధికారులకు సూచించారు.

SP RATNA : నూతనోత్సాహంతో పనిచేయాలి
ASP and DSP wishing SP

పుట్టపర్తిరూరల్‌, జనవరి 2(ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సరంలో నూతనోత్సాహంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలందించాలని ఎస్పీ రత్న పోలీసు అధికారులకు సూచించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, డీఎస్పీలు,సీఐలు, ఎస్సైలు, సిబ్బంది ఎస్పీని కలసి పూలబొకేలు అందచేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. నూతన సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునే విధంగా పనిచేయాలన్నారు. ఆసాంఘిక కార్యాకలాపాలకు అడ్డుకట్ట వేయాలని, చెక్‌పోస్టుల వద్ద మరింత నిఘా పెట్టాలని ఆదేశించారు. సైబర్‌నేరాలు, పూర్తిగా అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మత్తుపదార్థాల నియంత్రణపై పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కేక్‌కట్‌ చేసి, సిబ్బందికి నూతన వసా్త్రలను అందచేశారు. డీఎస్పీలు విజయ్‌కుమార్‌, శివన్నారాయణస్వామి, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, ఎస్బీ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, డీసీఆర్బీ సీఐ శ్రీనివాసులు, ఏఓ సుజాత, సూపరింటెండెంట్‌ సరస్వతి, ఆర్‌ఐలు మహేష్‌, వలి పాల్గొన్నారు.

Updated Date - Jan 03 , 2025 | 12:34 AM