Karnataka Madyam కర్ణాటక మద్యంతో దొరికిన వైసీపీ నాయకులు
ABN , Publish Date - Jan 16 , 2025 | 12:08 AM
కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వైసీపీ నాయకులను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు.
శెట్టూరు, జనవరి 15(ఆంధ్రజ్యోతి): కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వైసీపీ నాయకులను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. శెట్టూరు మండలం కైరేవు గ్రామానికి చెందిన గంగాధర, హనుమంతరాయుడు రెండు కేసుల కర్ణాటక మద్యాన్ని తెస్తుండగా మంగళవారం అరెస్టు చేశామని ఎక్సైజ్ ఇనచార్జి సీఐ సునీల్ కుమార్ తెలిపారు. మొత్తం 96 కర్ణాటక టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇద్దరిపై కేసు నమోదు చేశామని, వారి ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.