Share News

AP Liquor Business Controversy: మద్యం స్కాంపై దర్యాప్తు చేయించండి

ABN , Publish Date - Mar 25 , 2025 | 03:27 AM

టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం దేశంలోనే అతి పెద్దదని, ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు మించినదని ఆరోపించారు. ఈ స్కాంపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేశారు

AP Liquor Business Controversy: మద్యం స్కాంపై దర్యాప్తు   చేయించండి

  • లోక్‌సభలో టీడీపీపీ నేత లావు డిమాండ్‌

  • ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కంటే పెద్దదని వ్యాఖ్య

  • మద్యం స్కాంపై దర్యాప్తు చేయించండి: లావు

న్యూఢిల్లీ, మార్చి 25(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మద్యం కుంభకోణం దేశంలోనే అతి పెద్దదని, ఇది ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు మించినదని టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు. దీనిపై దర్యాప్తు చేయించాలన్నారు. సోమవారం లోక్‌సభలో 2025-26 ఆర్థిక బిల్లుపై ఆయన మాట్లాడుతూ నాటి వైసీపీ ప్రభుత్వం.. తమ ఆధీనంలోని సంస్థల ద్వారా మద్యం వ్యాపారాన్ని పూర్తిగా నియంత్రించి ప్రజలను మోసగించిందన్నారు. నంద్యాలలోని ఎస్పీవైౖ ఆగ్రో ఇండస్ర్టీస్‌ లాంటి ప్రముఖ డిస్టిలరీలను బలవంతంగా తీసుకుని.. కొత్త బినామీ డిస్టిలరీలను ఏర్పాటు చేశారని తెలిపారు. తక్కువ నాణ్యత కలిగిన మద్యాన్ని ఉత్పత్తి చేయించి, వేల కోట్ల రూపాయలు వైసీపీ అనుకూల వ్యాపారుల చేతికి వెళ్లేలా చేశారని ఆరోపించారు. మద్యం కుంభకోణంతో 2019-2024 మధ్య రాష్ట్ర ఖజానాకు 18,860.52కోట్ల నష్టం వాటిల్లిందన్నారు.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Mar 25 , 2025 | 03:29 AM