Share News

Electricity Tariff : విద్యుత్తు చార్జీలు పెంచం!

ABN , Publish Date - Jan 08 , 2025 | 04:31 AM

రాష్ట్రంలో విద్యుత్తు చార్జీలు పెంచడం లేదని, 2024-25 టారి్‌ఫనే 2025-26లోనూ కొనసాగిస్తామని రాష్ట్ర విద్యు త్తు పంపిణీ సంస్థ (డిస్కమ్‌)లు రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో స్పష్టం చేశాయి.

 Electricity Tariff : విద్యుత్తు చార్జీలు పెంచం!

  • 2025-26 టారి్‌ఫలో పెంపు ప్రతిపాదనే లేదు

  • సాగులో స్మార్ట్‌ మీటర్లు ప్రస్తుతానికి బిగించం

  • ప్రజాభిప్రాయ సేకరణలో డిస్కమ్‌ల స్పష్టీకరణ

అమరావతి, జనవరి 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యుత్తు చార్జీలు పెంచడం లేదని, 2024-25 టారి్‌ఫనే 2025-26లోనూ కొనసాగిస్తామని రాష్ట్ర విద్యు త్తు పంపిణీ సంస్థ (డిస్కమ్‌)లు రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో స్పష్టం చేశాయి. ఆదాయవ్యయాలు సమానంగా ఉండేలా రాబడి కంటే ఖర్చు పెరగకుండా చూశామని వెల్లడించాయి. 2025-26 టారి్‌ఫలో విద్యుత్తు చార్జీల పెంపును ప్రతిపాదించలేదని ఏపీ ఈఆర్‌సీ చైర్మన్‌ ఠాగూర్‌ రామ్‌ సింగ్‌కు డిస్కమ్‌లు స్పష్టం చేశాయి. వినియోగదారులపై 2025-26 టారి్‌ఫలో భారాన్ని వేయడంలేదని తెలిపాయి. 2025-26లో ఏపీఈపీడీసీఎల్‌ రూ.23,038.34 కోట్ల మేర ఆదాయవ్యయాలు సమానంగానూ, ఏపీఎస్సీడీసీఎల్‌లో రూ.22,830.44 కోట్ల ఆదాయవ్యయాలు సమానంగానూ.. లాభనష్టాలు లేకుండా వార్షిక ఆదాయ వ్యయ నివేదికను ఈఆర్‌సీకి సమర్పించాయి. అయితే.. ఏపీసీపీడీసీఎల్‌ మాత్రం రూ.12,899.74కోట్ల మేర ఆదాయం వస్తుందని, రూ.15,784.40 కోట్ల మేర వ్యయంతో రూ.2,978.66 కోట్ల మేర లోటును చూపించింది. అయితే మూడు డిస్కమ్‌లలోనూ ఆదాయవ్యయాలు సరిసమానంగా ఉండటంతో విద్యుత్తు చార్జీలను పెంచడంలేదని డిస్కమ్‌లు ఈఆర్‌సీకి స్పష్టం చేశాయి.

ట్రూఅప్‌, ఇంధన సర్దుబాటు ఎత్తివేయాలి!

విద్యుత్తు చార్జీలను పెంచబోమంటూ డిస్కమ్‌లు స్పష్టం చేసినప్పటికీ ప్రజాసంఘాలు ఈ మాటలను ఏమాత్రం నమ్మలేదు. ప్రభుత్వం నుంచి దాదాపు రూ.43,000 కోట్ల మేర రావాల్సి ఉందని డిస్కమ్‌లు తమ వార్షిక గణాంకాల్లో వెల్లడిస్తున్నాయని, ఈ డబ్బులు ఇవ్వకపోతే అవి ఆర్థికంగా నష్టపోతాయి కదాని హెచ్చరించాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను వ్యాపార వ్యవహారాల కోసం వినియోగించేందుకు సాధ్యం కాకపోవడంతో ఈ మొత్తాలను ఇతర ఆర్థిక సంస్థల నుంచి అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంటుందని చెబుతున్నాయి.


వ్యవసాయ మీటర్లపై స్పష్టతేదీ?

వ్యవసాయ విద్యుత్తు పంపుసెట్లకు స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుపై విద్యుత్తు డిస్కమ్‌లు స్పష్టత ఇవ్వకపోవడంపై ప్రజాసంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతానికి వ్యవసాయ విద్యుత్తు పంపుసెట్లకు స్మార్ట్‌ మీటర్లను బిగించడం లేదని 2025-26 వార్షిక ఆదాయ, వ్యయ నివేదికపై ఏపీఈఆర్‌సీ మంగళవారం విజయవాడలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో పేర్కొన్నాయి. ఏపీఈఆర్‌సీకి లిఖితపూర్వకంగా సమర్పించిన గణాంకాల్లో రీవాంప్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ స్కీమ్‌ (ఆర్‌డీఎ్‌సఎ్‌స)లో భాగంగా వ్యవసాయ విద్యుత్తుకు బిగించేందుకు వీలుగా స్మార్ట్‌ మీటర్లను సేకరించామని డిస్కమ్‌లు వెల్లడించడాన్ని ప్రజాసంఘాలు తప్పుబట్టాయి. ఇప్పటికే సేకరించిన మీటర్లకు చెల్లింపులు జరిగిపోయాయని, ఇప్పుడు ఆ మీటర్లను ఏం చేస్తారంటూ ప్రజా సంఘాలు నిలదీశాయి.

ముడుపులపై విచారణేదీ?: బాబూరావు

రాష్ట్రంలో విద్యుత్తు పంపిణీ సంస్థలు అదానీ విద్యుత్తు పంపిణీ సంస్థలుగా మారిపోయాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌.బాబూరావు విమర్శించారు. ‘అదానీతో ఒప్పందంలో రూ.1750 కోట్ల మేర ముడుపులు ముట్టాయంటూ అమెరికా న్యాయస్థానంలో వెల్లడైనప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దానిపై విచారణ జరపడం లేద ని ప్రశ్నించారు. వైసీపీ నేతలు మల్లాది విష్ణు, దేవినేని అవినాశ్‌ మంగళవారం ఈఆర్‌సీ రాంసింగ్‌ ఠాగూర్‌ను కలసి విద్యుత్తు చార్జీల భారాన్ని తగ్గించాలంటూ వినతి పత్రాన్ని అందించారు.

Updated Date - Jan 08 , 2025 | 04:31 AM