AP Government : గేమ్ చేంజర్, డాకు మహారాజ్ టికెట్ల ధర పెంపు
ABN , Publish Date - Jan 05 , 2025 | 03:39 AM
రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’, నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ సినిమాల టికెట్ల ధర పెంపునకు ప్రభుత్వం అనుమతిచ్చింది.

రోజుకు ఐదు షోలకు ప్రభుత్వ అనుమతి
అమరావతి, జనవరి 4(ఆంధ్రజ్యోతి): రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’, నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ సినిమాల టికెట్ల ధర పెంపునకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ చిత్రాలకు బెనిఫిట్ షోతో పాటు 2 వారాల పా టు రోజుకు ఐదు షోల ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు హోంశాఖ శనివారం ఉత్తర్వు లు జారీచేసింది. దర్శకుడు ఎస్. శంకర్ తెరకెక్కించిన ‘గేమ్ చేంజర్’ ఈ నెల 10న విడుదల కానుం ది. అర్ధరాత్రి ఒంటి గంటకు ప్రదర్శించే బెనిఫిట్ షో టికెట్‌కు రూ.600 వసూలు చేసుకునేందుకు.. 11-23వ తేదీ వరకు అదనపు షో(రోజుకు ఐదు షో లు) ప్రదర్శనకు సమ్మతి తెలిపింది. మొదటి 2 వారాల పాటు మల్టీప్లెక్స్‌లో టికెట్‌పై అదనంగా రూ.175, సింగిల్ స్ర్కీన్ థియేటర్లో రూ.135 వరకు ధర పెంచుకునేందుకు ప్రభుత్వం అంగీకరించింది.
సంక్రాంతి పోటీలో బాలయ్య..
బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా ఈనెల 12న రానుంది. 12న ఉదయం 4 గంటలకు బెనిఫిట్ షో టికెట్‌కు రూ.500 వసూలు చేసేందు కు ప్రభుత్వం అనుమతిచ్చింది. 2వారాల పాటు మల్టీప్లెక్స్‌లో టికెట్‌పై అదనంగా రూ.135, సింగిల్ స్ర్కీన్‌లో రూ.110 పెంచేందుకు సమ్మతి తెలిపింది.