Share News

Andhra Pradesh: ఏపీ ఇంటర్ బోర్డ్ సంచలన నిర్ణయం

ABN , Publish Date - Jan 08 , 2025 | 01:02 PM

Andhra Pradesh: ఏపీ ఇంటర్ బోర్డ్ సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలనే ఉద్దేశ్యంతో కీలక నిర్ణయం తీసుకుంది.

Andhra Pradesh: ఏపీ ఇంటర్ బోర్డ్ సంచలన నిర్ణయం
Andhra Pradesh Inter Exams

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం ఇంటర్ పరీక్షల్లో సంస్కరణలు తెచ్చింది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు చేసింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై కేవలం సెకండియర్ పరీక్షలను మాత్రమే నిర్వహించనుంది. చాలా ఏళ్లుగా ఇంటర్ విద్యలో సంస్కరణలు జరగలేదని, జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి సంస్కరణలు చేపడుతున్నట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. సైన్స్, ఆర్ట్స్, భాషా సబ్జెక్టుల్లో సంస్కరణలు అమలు చేస్తామన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి సలహాలు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.


2025-26 నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎన్‍సీఈఆర్‍టీ పాఠ్యపుస్తకాలు ప్రవేశపెట్టారని, నీట్, జేఈఈ వంటి జాతీయ స్థాయి పోటీపరీక్షలకు సులభమవుతుందని అన్నారు. సంస్కరణల్లో భాగంగా ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు తొలగిస్తున్నామని స్పష్టం చేశారు. ఆయా కళాశాలలు అంతర్గతంగా ప్రథమ సంవత్సర పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను మాత్రమే బోర్డు నిర్వహిస్తుందని తెలిపారు. ఈనెల 26లోగా సంస్కరణలపై సలహాలు, సూచనలు పంపాలని ఇంటర్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా కోరారు.

Updated Date - Jan 08 , 2025 | 01:31 PM