Andhra Pradesh: సంచలన ఆడియో పంపిన రాజ్ కసిరెడ్డి..
ABN , Publish Date - Apr 19 , 2025 | 04:34 PM
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి.. ఎట్టకేలకు స్పందించాడు. అయితే, ప్రత్యక్షంగా కాకుండా.. ఓ ఆడియో సందేశం పంపి సంచలనానికి తెరలేపాడు. ఇంతకీ రాజ్ తన ఆడియో మెసేజ్‌లో ఏం చెప్పాడు..
అమరావతి, ఏప్రిల్ 19: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి.. ఎట్టకేలకు స్పందించాడు. అయితే, ప్రత్యక్షంగా కాకుండా.. ఓ ఆడియో సందేశం పంపి సంచలనానికి తెరలేపాడు. ఇంతకీ రాజ్ తన ఆడియో మెసేజ్‌లో ఏం చెప్పాడు.. తనపై వస్తున్న ఆరోపణలపై ఎలాంటి క్లారిటీ ఇచ్చాడు.. అసలు అతను ఎక్కడ ఉన్నానన్నాడు.. పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.
లిక్కర్ స్కామ్‌లో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి శనివారం నాడు ఒక ఆడియో మెసేజ్ రిలీజ్ చేశాడు. తనపై వస్తున్న ఆరోపణలకు క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు.. తనపై ఆరోపణలు చేసిన వారిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని లక్ష్యంగా చేసుకుని సంచలన కామెంట్స్ చేశాడు. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తనకు సిట్ బృందం ఇచ్చిన నోటీసులపై లీగల్‌గా పోరాడుతున్నానని రాజ్ కసిరెడ్డి తెలిపారు. తనకు రెండుసార్లు నోటీసులు ఇచ్చారని ఆడియో మెసేజ్‌లో పేర్కొన్నారు. దీనిపై తాను కోర్టుకు వెళ్లగా.. నిర్ణీత సమయం ఇచ్చి నోటీసులు ఇవ్వాలని ఆదేశించారని కసిరెడ్డి పేర్కొన్నారు.
నాకు సంబంధం లేదు..
మద్యం కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని రాజ్ కసిరెడ్డి తేల్చి చెప్పారు. తనపై ఆరోపణలు చేసిన విజయసాయి రెడ్డిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి బట్టేబాజ్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన న్యాయ పోరాటం పూర్తయిన తరువాత.. విజయసాయి రెడ్డి చరిత్ర బయటపెడతానని రాజ్ కసిరెడ్డి ప్రకటించారు. మీడియా ప్రతినిధులందరినీ పిలిచి బట్టేబాజ్ విజయసాయిరెడ్డి చరిత్ర మొత్తం బయటపెడతానని చెప్పారు. ఒకవైపు వాదన విని కథనాలు రాయొద్దంటూ మీడియాను కోరారు రాజ్. తనపై అసత్య కథనాలు సరికాదని విజ్ఞప్తి చేశారు.
Also Read:
అక్షయ తృతీయ గోల్డ్ బదులు ఇవి కొన్నా అదృష్టమే.
గుడ్ న్యూస్.. ఆ ఉత్తర్వులు జారీ..
Andhra Pradesh News and Telugu News..