Share News

AP Ministers: మార్చి నాటికి బందరు ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తి

ABN , Publish Date - Apr 28 , 2025 | 04:05 PM

AP Ministers: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని హో మంత్రి అనిత అన్నారు. మహిళలు ముందుకు వచ్చి రాజధాని కోసం పోరాటం చేశారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు.

AP Ministers: మార్చి నాటికి బందరు ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తి

మచిలీపట్నం, ఏప్రిల్ 28: 2026, మార్చి నాటికి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను పూర్తి చేసి..ప్రజలకు అంకితం చేస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ పూర్తి చేయాలనే లక్ష్యంతో కాల పరిమితిని వరుసగా రెండో సారి పొడిగించామని ఆయన తెలిపారు. సోమవారం మచిలీపట్నంలోని ఫిషింగ్ హార్బర్ పనులను మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్ పరిశీలించారు.

అనంతరం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ఫిషింగ్ హార్బర్ పనులు నిలిచిపోయాయని గుర్తు చేశారు. ఈ హార్బర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలనే ఆలోచనతో దాదాపు రూ.422 కోట్లతో ఈ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటికే ఈ హార్బర్ పనులు దాదాపు 57 శాతం పూర్తయ్యాయని వివరించారు. కానీ కొన్ని కీలకమైన పనుల్లో జాప్యం జరిగిందని చెప్పారు. దాదాపు రూ.3500 కోట్లతో ఈ తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను పూర్తి చేస్తున్నామని వివరించారు.


ఈ హార్బర్ పూర్తయిన అనంతరం ఈ ప్రాంతాన్ని టూరిజం హాబ్ తీర్చిదిద్దాలని మంత్రి కొల్లు రవీంద్ర కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాతే ఫిషింగ్ హర్బర్ పనులు వేగంగా ముందుకు కదులుతున్నాయని స్పష్టం చేశారు. ఆ క్రమంలోనే పోర్టులు,ఫిషింగ్ హార్బర్ల పురోగతిపై తాము ప్రతీ నెలా సమీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.

స్థానిక మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని మంత్రి వివరించారు. ఇక సీ మౌత్ సమస్యను టెక్నికల్‌గా పరిష్కరించేందుకు చెన్నైకి పంపించాం.. అది మరో 45 రోజుల్లో వస్తోందన్నారు. ఆది వచ్చిన తర్వాత సీ మౌత్‌ను సైతం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ రాజధాని అమరావతి పునర్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నారు. ఈ నేపధ్యంలో మచిలీపట్నంలోని జిల్లా కలెక్టరేట్‌లో ప్రధాని పర్యటన సందర్భంగా ఏర్పాట్లపై మంత్రులు వంగలపూడి అనిత,కొల్లు రవీంద్ర,బిసి జనార్ధన రెడ్డి,వాసంశెట్టి సుభాష్‌తోపాటు జిల్లాలకు చెందని ఎమ్మెల్యేల సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, బిసి జనార్ధన రెడ్డి మాట్లాడుతూ.. మే 2వ తేదీన జరిగే అమరావతి నిర్మాణ పునఃప్రారంభ పనులకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారన్నారు. జగన్ మూడు రాజధానుల పేరుతో అమరావతిపై కుట్రలు చేశారని మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షల మేరకు మళ్లీ అమరావతి పనుల్ని వేగవంతం చేస్తున్నామన్నారు. రాష్ట్ర నాలు మూలాల నుండి ప్రజలు పెద్దఎత్తున ప్రధాని కార్యక్రమానికి తరలి రానున్నారన్నారు.

కృష్ణా జిల్లా నుండి లక్ష మంది జనం వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. సభకు విచ్చేసిన ప్రజలకు అన్ని రకాల సదుపాయలు కల్పించేలా అధికారుల్ని సన్నద్ధం చేస్తున్నామని చెప్పారు. రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా వారు పిలుపు నిచ్చారు. గతంలో విశాఖ కేంద్రంగా ప్రధాని లక్షల కోట్ల పెట్టుబడులకు శ్రీకారం చుట్టారన్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రులు గుర్తు చేశారు. ఇప్పుడు ప్రజల రాజధాని మన రాజధాని అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నారని చెప్పారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.


రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయన్నారు. మహిళలు ముందుకు వచ్చి రాజధాని కోసం పోరాటం చేశారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు.గత సీఎం వైఎస్ జగన్.. వారిపై పోలీసులతో దారుణంగా దాడులు చేయించారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి రావడం శుభపరిణామని చెప్పారు. రాజధాని లేని రాష్ట్రంగా మన రాష్ట్రం ఉందని తెలిపారు. జగన్ మూడు రాజధానుల పేరుతో అమరావతిని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి పునర్ నిర్మాణం కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా ప్రజలకు మంత్రి అనిత పిలుపు నిచ్చారు.

ఇవి కూడా చదవండి:

Pahalgam Terror Attack: భరత్ భూషణ్ భార్య సుజాతను విచారించిన ఎన్ఐఏ

Pahalgam Terror Attack: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఉగ్ర దాడిపై స్పందించిన సీఎం

Varanasi: వారణాసిలో కెనడియన్ అరెస్ట్.. ఎందుకంటే..

Hyderabad IT Corridor: బంగ్లాదేశ్ వాసి అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు

Pahalgam Terror Attack: పాకిస్థానీ యూట్యూబ్ చానెల్స్‌ను నిషేధించిన భారత్

Supreme Court: కేంద్ర ప్రభుత్వానికి, ఓటీటీలకు సుప్రీంకోర్టు నోటీసులు.. ఎందుకంటే..

Updated Date - Apr 28 , 2025 | 04:06 PM