Share News

Entrance Test: ఏయూఈఈటీ-2025 షెడ్యూలు విడుదల

ABN , Publish Date - Apr 21 , 2025 | 04:17 AM

ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్ష (AUEET-2025) షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఏప్రిల్‌ 24 వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయి, మే 5న పరీక్ష నిర్వహించనున్నారు

 Entrance Test: ఏయూఈఈటీ-2025 షెడ్యూలు విడుదల

విశాఖపట్నం, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): సెల్ఫ్‌ సపోర్ట్‌ విధానంలో నిర్వహించే ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏయూఈఈటీ-2025)కు ఈ నెల 24వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ డీఏ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. రూ.750 అపరాధ రుసుముతో మే ఒకటో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. మే మూడో తేదీన హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, మే ఐదో తేదీ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి నాలుగు గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. మే ఆరో తేదీన ప్రిలిమినరీ కీ విడుదల చేస్తామని, ఎనిమిదో తేదీన వరకు ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలను స్వీకరిస్తామని, తొమ్మిదో తేదీ ఉదయం 10 గంటలకు ఫైనల్‌ కీ విడుదల చేయనున్నట్టు తెలిపారు. అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్టు వివరించారు.

Updated Date - Apr 21 , 2025 | 04:17 AM