డ్రంకెన్ డ్రైవ్ కేసులు 250
ABN , Publish Date - Jan 02 , 2025 | 01:44 AM
కొత్త సంవత్సరమని ఫుల్‌గా మందేశారు. మద్యం మత్తులో రోడ్డుపైకి వాహనాలు నడుపుతూ వచ్చారు. ఇలా మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు జిల్లాలో మందుబాబులు హల్‌చల్ చేశారు.
కొత్త సంవత్సరమని ఫుల్‌గా మందేశారు. మద్యం మత్తులో రోడ్డుపైకి వాహనాలు నడుపుతూ వచ్చారు. ఇలా మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు జిల్లాలో మందుబాబులు హల్‌చల్ చేశారు. బ్రీత్ అనలైజర్ ద్వారా పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 250 మంది పట్టుబడ్డారు. వీరిపై కేసులు నమోదయ్యాయి. మిగతా వాళ్లు పోలీసులను చూసి పక్క వీధులగుండా.. లేదా వెనక్కి వెళ్లిపోయి తప్పించుకున్నారు. రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ఎస్పీ సుబ్బరాయుడు జిల్లాలోని పలు ప్రాంతాల్లో తిరగడంతో అధికారులు, సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉన్నారు. దీంతో ఎక్కడా మందుబాబుల ఆగడాలు.. రోడ్డు ప్రమాదాలు జరగకుండా కట్టడి చేయగలిగారు. తిరుపతి నగరంతో పాటు రూరల్, చంద్రగిరి, శ్రీకాళహస్తి, నాయుడుపేట, సూళ్ళూరుపేట, సత్యవేడు తదితర ప్రాంతాల్లో మంగళవారం రాత్రి 9 గంటల నుంచి రిజర్వు, శాంతి భద్రతలు, ఎస్టీఎఫ్, ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ చేశారు. కాగా, పట్టుబడిన 250 మందిలో 20 నుంచి 35 సంవత్సరాల వారు 90 మంది వరకు ఉన్నట్లు అంచనా. దాదాపు 180 మంది వరకు ద్విచక్రవాహనదారులే ఉన్నారు. 6 కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మందుబాబుల తనిఖీల్లో అత్యధికంగా బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ 339 వరకు వచ్చినట్లు సమాచారం.
- తిరుపతి(నేరవిభాగం), ఆంధ్రజ్యోతి