ఎయిర్ స్ట్రిప్
ABN , Publish Date - Jan 04 , 2025 | 01:34 AM
సత్యవేడు, వరదయ్యపాలెం మండలాల్లో విస్తరించి ఉన్న శ్రీసిటీ సెజ్‌లో విమానాల రాకపోకలకు వీలు కల్పించేలా ఎయిర్‌స్ర్టిప్ ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సివిల్ ఏవియేషన్ అధికారులకు సూచించారు. శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసంలో రాష్ట్రంలోని ఎయిర్‌పోర్టుల అభివృద్ధి, కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు, ఏపీ సివిల్ ఏవియేషన్ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని విమానాశ్రయాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలతో పాటు కొత్తగా ఏర్పాటు చేయాల్సిన ఎయిర్‌పోర్టుల, ఎయిర్‌స్ట్రి్‌పల గురించీ ఆలోచించాలని సూచించారు. అందులో భాగంగా శ్రీసిటీ పరిధిలో ఎయిర్‌స్ర్టిప్ గురించి ప్రస్తావించారు. పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు, విదేశీ ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు రాకపోకలు సాగించడానికి వీలుగా శ్రీసిటీలో ఎయిర్‌స్ర్టిప్ అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆయన సివిల్ ఏవియేషన్ అధికారులకు సూచించారు.
ఫ అవకాశాలు పరిశీలించాలని ఏవియేషన్ అధికారులకు సీఎం సూచన
తిరుపతి, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): సత్యవేడు, వరదయ్యపాలెం మండలాల్లో విస్తరించి ఉన్న శ్రీసిటీ సెజ్‌లో విమానాల రాకపోకలకు వీలు కల్పించేలా ఎయిర్‌స్ర్టిప్ ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సివిల్ ఏవియేషన్ అధికారులకు సూచించారు. శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసంలో రాష్ట్రంలోని ఎయిర్‌పోర్టుల అభివృద్ధి, కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు, ఏపీ సివిల్ ఏవియేషన్ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని విమానాశ్రయాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలతో పాటు కొత్తగా ఏర్పాటు చేయాల్సిన ఎయిర్‌పోర్టుల, ఎయిర్‌స్ట్రి్‌పల గురించీ ఆలోచించాలని సూచించారు. అందులో భాగంగా శ్రీసిటీ పరిధిలో ఎయిర్‌స్ర్టిప్ గురించి ప్రస్తావించారు. పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు, విదేశీ ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు రాకపోకలు సాగించడానికి వీలుగా శ్రీసిటీలో ఎయిర్‌స్ర్టిప్ అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆయన సివిల్ ఏవియేషన్ అధికారులకు సూచించారు.
ఆగస్టులోనే ప్రస్తావన
శ్రీసిటీ సెజ్ ఏర్పాటు చేసే సమయంలోనే ఎయిర్‌స్ర్టిప్ నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. సెజ్‌కోసం 10వేల ఎకరాల సేకరించాలని తొలుత ప్రతిపాదించగా 8వేల ఎకరాలు మాత్రమే ఇప్పటి వరకూ సేకరించారు. ఇంకా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి భూముల కోసం డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో తొలినాటి ప్రతిపాదనలకు అనుగుణంగా మరో 2వేల ఎకరాల భూములు సేకరించి ఏపీఐసీసీ ద్వారా శ్రీసిటీకి అప్పగించాలని సీఎం చంద్రబాబు జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మూడవ నెలలోనే గత ఏడాది ఆగస్టు 19న శ్రీసిటీలో పర్యటించారు. ఆ సందర్భంలో ఎయిర్‌స్ర్టిప్ అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. దానిపై సెజ్ యాజమాన్యం నుంచి పూర్తి వివరాలు తీసుకొని నివేదించాలని జిల్లా యాంత్రంగాన్ని సీఎం ఆదేశించారు. ఆతర్వాత ఎయిర్‌స్ట్రిప్ అవసరం, అవకాశాలు, ఇతర మౌళిక సదుపాయాల గురించిన వివరాలు కోరుతూ జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ ఇటీవల శ్రీసిటీ యాజమాన్యానికి లేఖ రాశారు. వారి నుంచి స్పందన వచ్చిన తర్వాత ఎయిర్‌స్ట్రి్‌పపై మరింత స్పష్టత రానుంది.