తిరుమలలో నేడు మరో బంగారు బాబు
ABN , Publish Date - Jan 02 , 2025 | 01:31 AM
తిరుమల శ్రీవారి దర్శనానికి బుధవారం మరో బంగారుబాబు వచ్చారు. కర్ణాటకకు చెందిన రవి ఐదు కేజీల బంగారు ఆభరణాలను ధరించి శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి బుధవారం మరో బంగారుబాబు వచ్చారు. కర్ణాటకకు చెందిన రవి ఐదు కేజీల బంగారు ఆభరణాలను ధరించి శ్రీవారిని దర్శించుకున్నారు. తెలంగాణకు చెందిన కొండ విజయ్‌కుమార్ కూడా ఈరోజు మళ్లీ స్వామి దర్శనం చేసుకున్నారు. మెడలో భారీ బంగారు హారాలతో వచ్చిన వీరిని ఆలయం బయట భక్తులు ఆసక్తిగా చూశారు.
- తిరుమల, ఆంధ్రజ్యోతి