అన్నప్రసాద భవనంలో మరో కియోస్క్
ABN , Publish Date - Jan 02 , 2025 | 01:29 AM
తిరుమలలోని వెంగమాంబ అన్నప్రసాద భవనంలో విరాళాల సమర్పణ కోసం టీటీడీ బుధవారం మరో కియో్‌స్కను ప్రారంభించింది.
తిరుమల, జనవరి1(ఆంధ్రజ్యోతి): తిరుమలలోని వెంగమాంబ అన్నప్రసాద భవనంలో విరాళాల సమర్పణ కోసం టీటీడీ బుధవారం మరో కియో్‌స్కను ప్రారంభించింది. అన్నప్రసాదం ట్రస్టుకు సులభతరంగా విరాళాలు అందించేందుకు ఇప్పటికే సౌత్ ఇండియన్ బ్యాంక్ అందజేసిన కియా్‌స్కను టీటీడీ డిసెంబరు నెలలో ప్రారంభించింది. తాజాగా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విరాళంగా ఇచ్చిన మరో కియో్‌స్కను బుధవారం టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రారంభించారు. ఈ మిషన్ల ద్వారా భక్తులు ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు తక్కువ మొత్తాన్ని (రూ.1 నుంచి రూ.99 వేల వరకు) కూడా విరాళంగా అందజేయవచ్చు. కియా్‌స్కలోని క్యూఆర్ కోర్డును స్కాన్ చేసి యూపీఐ ద్వారా విరాళాలు టీటీడీ ఖాతాలో జమచేయవచ్చు.