శేషాచలంలో బీటెక్ విద్యార్థుల అదృశ్యం
ABN , Publish Date - Jan 04 , 2025 | 01:55 AM
అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం శేషాచల అడవుల్లో బీటెక్ విద్యార్థులు అదృశ్యమయ్యారని సమాచారం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఆరుగురు బీటెక్ విద్యార్థులు ఇక్కడి వాగేటికోన ప్రాంతంలో.. గుంజన జలపాతాలను చూడడానికి శుక్రవారం విహారయాత్రగా వచ్చారు. తిరుగు ప్రయాణంలో దారి తప్పినట్లు తెలిసింది. రాత్రి కావడంతో ఆందోళన చెందిన వీరు.. ఫోన్ సిగ్నల్స్ రావడంతో మిత్రులకు సమాచారం అందించారు. మిత్రుల సలహా మేరకు లైవ్ సిగ్నల్స్ లొకేషన్ పంపించారు. వీరంతా అడవిలో తిరుగుతూ చివరకు రైల్వేకోడూరు అటవీ పరిధిలోని ఎస్.ఉప్పరపల్లి, ఎస్.కొత్తపల్లి ప్రాంతాల పరిధిలోకి రాగానే ఫోన్ సిగ్నల్స్ రావడంతో రేణిగుంట పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.
ఆచూకీ కోసం అటవీశాఖ అధికారులతో కలసి పోలీసుల గాలింపు
మిత్రులకు లొకేషన్ షేర్ చేసిన ఓ విద్యార్థిరైల్వేకోడూరు(రూరల్), జనవరి 3 (ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం శేషాచల అడవుల్లో బీటెక్ విద్యార్థులు అదృశ్యమయ్యారని సమాచారం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఆరుగురు బీటెక్ విద్యార్థులు ఇక్కడి వాగేటికోన ప్రాంతంలో.. గుంజన జలపాతాలను చూడడానికి శుక్రవారం విహారయాత్రగా వచ్చారు. తిరుగు ప్రయాణంలో దారి తప్పినట్లు తెలిసింది. రాత్రి కావడంతో ఆందోళన చెందిన వీరు.. ఫోన్ సిగ్నల్స్ రావడంతో మిత్రులకు సమాచారం అందించారు. మిత్రుల సలహా మేరకు లైవ్ సిగ్నల్స్ లొకేషన్ పంపించారు. వీరంతా అడవిలో తిరుగుతూ చివరకు రైల్వేకోడూరు అటవీ పరిధిలోని ఎస్.ఉప్పరపల్లి, ఎస్.కొత్తపల్లి ప్రాంతాల పరిధిలోకి రాగానే ఫోన్ సిగ్నల్స్ రావడంతో రేణిగుంట పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు రేణిగుంట పోలీసులు కోడూరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ హేమసుందర్‌రావు ఆదేశాల మేరకు కోడూరు ఎస్‌ఐ నవీన్ బాబు తమ సిబ్బందితో అటవీశాఖ అధికారులతో కలిసి అడవిలో జల్లెడ పడుతున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ అందుబాటులోకి వస్తే వారి ఆచూకీ త్వరగా లభిస్తుంది. తప్పిపోయిన విద్యార్థుల వివరాల కోసం పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది.