Share News

విద్యార్థుల పాద పరిమాణాలను నమోదు చేయండి

ABN , Publish Date - Jan 02 , 2025 | 01:32 AM

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర (ఎస్‌ఆర్‌కేవీఎం) కిట్‌లను అందించేందుకుగాను వారి పాదాల కొలతలను నమోదు చేయాలని డీఈవో కేవీఎన్‌ కుమార్‌ ఆదేశించారు.

 విద్యార్థుల పాద పరిమాణాలను నమోదు చేయండి

తిరుపతి(విద్య), జనవరి 1(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర (ఎస్‌ఆర్‌కేవీఎం) కిట్‌లను అందించేందుకుగాను వారి పాదాల కొలతలను నమోదు చేయాలని డీఈవో కేవీఎన్‌ కుమార్‌ ఆదేశించారు. 1 నుంచి 10వ తరగతి విద్యార్థుల పాదాల కొలతలను తీయించి ఎస్‌ఆర్‌కేవీఎం యాప్‌లో అప్‌లోడ్‌ చేసే బాధ్యత హెచ్‌ఎంలదేనని తెలిపారు. ఈ నెల 7వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు నమోదు కార్యక్రమం 100 శాతం పూర్తికావాలని స్పష్టం చేశారు. కిట్లలో నోటు పుస్తకాలు, బెల్ట్‌, బూట్లు, బ్యాగ్‌, పిక్టోరియల్‌ డిక్షనరీ, ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ, టెక్ట్స్‌ బుక్స్‌, వర్క్‌ బుక్స్‌, మూడు జతల యూనిఫారం క్లాత్‌తోపాటు మరికొన్ని వస్తువులు ఉంటాయని వివరించారు. డేటా ఆన్‌లైన్‌లో నమోదు చేయడమేగాక హార్డ్‌ కాపీలను డీఈవో కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు.

Updated Date - Jan 02 , 2025 | 01:32 AM