Tax: సగం కూడా వసూలు కాలా !
ABN , Publish Date - Mar 23 , 2025 | 01:27 AM
జిల్లాలోని ఒక నగరపాలక, నాలుగు మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్లు మందకొడిగా సాగుతున్నాయి.

మిగిలిందిక 8 రోజులే..
చిత్తూరు అర్బన్, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): నగర, పురపాలకలకు ఆస్తిపన్నులే పట్టుకొమ్మలు. వీటి ద్వారా వచ్చే ఆదాయంతోనే ఆయా మున్సిపాలిటీల పరిధిలో అభివృద్ధి పనులను చేపడతారు. ప్రస్తుతం జిల్లాలోని ఒక నగరపాలక, నాలుగు మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్లు మందకొడిగా సాగుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఎనిమిది రోజులే గడువుంది. ఈ నెలాఖరుకు పాత బకాయిలతో కలిపి మొత్తం రూ.62.63కోట్లు వసూలు చేయాలి. శనివారం నాటికి రూ.30.26కోట్లు వసూలైంది. కమిషనర్లు.. రెవెన్యూ విభాగం అధికారులను పరుగులు తీయిస్తున్నప్పటికీ ఆశించిన ఫలితం రావడం లేదు. కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యమే పన్నులు వసూలు కాకపోవడానికి కారణమని ఉన్నతాధికారులు అంటున్నారు.
వడ్డీ మాఫీ కోసం ఎదురుచూపులు
ఆస్తి పన్నుపై గత ప్రభుత్వం వడ్డీమాఫీ చేసింది. ఈ సారి కూడా వడ్డీమాఫీ చేస్తే భారీ ఎత్తున పన్ను వసూలయ్యే అవకాశం ఉంది. పలువురు పన్ను చెల్లింపుదారులు కూడా ఇందుకోసం ఎదురుచూస్తున్నారు.
శనివారం వరకు వసూలైన పన్నుల వివరాలు
మున్సిపాలిటీ భవనాలు మొత్తం వసూలు
(రూ.కోట్లలో)
చిత్తూరు 44,879 39.60 17.43
పుంగనూరు 13,639 7.20 4.56
పలమనేరు 13,447 4.92 3.25
కుప్పం 12,998 6.38 2.61
నగరి 14,837 4.53 2.41
మొత్తం 99,800 62.63 30.26