Tirupati: రుయా సెంట్రల్ ల్యాబ్‌లో లైంగిక వేధింపులు
ABN , Publish Date - Mar 26 , 2025 | 10:10 AM
పారా మెడికల్ విద్యార్థినులను ఇద్దరు ల్యాబ్ టెక్నిషియన్లు లైంగికంగా వేధించారని 20 మంది పారా మెడికల్ విద్యార్థినులు రాతపూర్వకంగా రుయా సూపరింటెండెంటుకు పిర్యాదు చేసారు. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటపతి, రాజశేఖర్‌ను ఆర్దోపెడిక్ ఓపీ విభాగానికి బదిలీ చేశారు.

తిరుపతి: రుయా సెంట్రల్ ల్యాబ్ (Ruya Central Lab)లో లైంగిక వేధింపులు (Harassment) కలకలం రేపాయి. ఈ ఘటనపై తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ టీడీపీ (TDP) ఆధ్వర్యంలో బీసీ సంఘాల నేతలు (BC union leaders) ఆందోళనకు (Protest) దిగారు. పారా మెడికల్ విద్యార్థినులను (Para Medical Students) ఇద్దరు ల్యాబ్ టెక్నిషియన్లు లైంగికంగా వేధించారని 20 మంది పారా మెడికల్ విద్యార్థినులు రాతపూర్వకంగా సూపరింటెండెంటుకు పిర్యాదు చేసారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటపతి, రాజశేఖర్‌ను ఆర్దోపెడిక్ ఓపీ విభాగానికి బదిలీ చేశారు. సమగ్ర విచారణ నిమిత్తం నలుగురు సభ్యులతో కమిటీని నియమించారు. ఈ కమిటీ దర్యాప్తు జరిపి నివేదిక ఇచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా లైగింక వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ బీసీ సెల్ నేత జగన్నాథం డిమాండ్ చేశారు. గతంలో ఎక్స్‌రే విభాగంలో ఇలాగే వేధింపులు జరిగినా చర్యలు తీసుకోలేదని విమర్శలు వస్తున్నాయి.
Also Read..: ఏపీ మద్యం స్కాంపై అమిత్ షా ఆరా
మరోవైపు లైంగిక వేధింపుల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని హిందూపురం అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తి లలితాలక్ష్మీ హారిక కోట సూచించారు. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో తల్లులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో లైంగిక వేధింపులు, బాల్యవివాహాల నిరోధంపై న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ సదస్సులో న్యాయమూర్తితో పాటు మున్సిపల్ చైర్మన్ డిఈ రమేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సంగం శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ, ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రధానంగా మంచి స్పర్శ, చెడు స్పర్శలపై ఆడపిల్లలకు సరైన అవగాహన కల్పించాలన్నారు. లైంగిక వేధింపులకు గురి చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయని తెలియజేశారు. ఇలాంటి విషయాల్లో దాపరికాలు లేకుండా పిల్లలు తెలియజేసే విధంగా చూడాలన్నారు. అదే విధంగా రాజ్యాంగం నిర్దేశించిన వయసు మేరకే తల్లిదండ్రులు అమ్మాయిలకు వివాహం చేయాలన్నారు. అమ్మాయిలు సమాజంలో ఎదురవుతున్న సమస్యలను తల్లిదండ్రుల దృష్టికి తీసుకువస్తే వాటిని నిర్లక్ష్యం చేయకుండా అవగాహన కల్పించేందుకు కృషి చేయాలన్నారు.
ప్రేమలో ఉన్నవారు ఈ తప్పులు చేయొద్దు..
పాపవినాశనంలో బోటింగ్‌పై వివాదం..
అవినాశ్ డైరెక్షన్ కృష్ణారెడ్డి యాక్షన్
For More AP News and Telugu News