Share News

ఇల వైకుంఠం

ABN , Publish Date - Jan 11 , 2025 | 02:21 AM

శ్రీవారి ఆలయంలో దాదాపు 5 టన్నులు.. వెలుపల మరో 5 టన్నుల పుష్పాలు.. 1.20 లక్షల కట్‌ ఫ్లవర్స్‌తో అలంకరణలే. విద్యుద్దీపాలంకరణలతో తిరుమల ‘ఇల వైకుంఠం’గా మారింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మనసుదోచే విద్యుత్‌, పుష్పాలంకరణలో స్వామి కొండను సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. శ్రీవారి ఆలయం ముందు వేసిన ‘రంగనాథ స్వామి ఆలయ’ సెట్టింగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వామి దర్శనం అనంతరం భక్తులందరూ ఈ సెట్టింగ్‌ను ఆసక్తిగా తిలకిస్తున్నారు.

ఇల వైకుంఠం
శ్రీవారి ఆలయంలో

ఇల వైకుంఠం

  • పుష్ప, విద్యుత్‌

అలంకరణలతో కనువిందుగా కొండ

శ్రీవారి ఆలయంలో దాదాపు 5 టన్నులు.. వెలుపల మరో 5 టన్నుల పుష్పాలు.. 1.20 లక్షల కట్‌ ఫ్లవర్స్‌తో అలంకరణలే. విద్యుద్దీపాలంకరణలతో తిరుమల ‘ఇల వైకుంఠం’గా మారింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మనసుదోచే విద్యుత్‌, పుష్పాలంకరణలో స్వామి కొండను సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. శ్రీవారి ఆలయం ముందు వేసిన ‘రంగనాథ స్వామి ఆలయ’ సెట్టింగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వామి దర్శనం అనంతరం భక్తులందరూ ఈ సెట్టింగ్‌ను ఆసక్తిగా తిలకిస్తున్నారు. పూలు, పండ్లుతో చేసిన దేవతల అలంకరణలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఈసారి మైసూరు దసరా ఉత్సవాల్లో విద్యుత్‌ అలంకరణలు చేసే నిపుణులు తిరుమలలో అలంకరణలు చేపట్టడంతో భక్తులు నూతన అనుభూతులను పొందుతున్నారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మహావిష్ణువు, శ్రీలక్ష్మీదేవి, గరుడ ఇతర దేవతామూర్తుల విద్యుత్‌ కటౌట్లు, సప్తగిరి వద్ద విద్యుత్‌ సప్తద్వారాలు కూడా శోభాయమానంగా దర్శనమిస్తున్నాయి.

- తిరుమల, ఆంధ్రజ్యోతి

Updated Date - Jan 11 , 2025 | 02:21 AM