Share News

మూడు రోజుల్లో మందుబాబుల మద్యం ఖర్చు రూ.33.44 కోట్లు!

ABN , Publish Date - Jan 02 , 2025 | 01:41 AM

కొత్త ఆంగ్ల సంవత్సరాదికి మందుబాబులు ఖుషీ చేశారు. మూడు రోజుల్లో దాదాపు రూ.33.44 కోట్ల మద్యాన్ని తాగారు. ఇందులో డిసెంబరు 31వ తేదీన రూ.13.10 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.

మూడు రోజుల్లో మందుబాబుల మద్యం ఖర్చు రూ.33.44 కోట్లు!

కొత్త ఆంగ్ల సంవత్సరాదికి మందుబాబులు ఖుషీ చేశారు. మూడు రోజుల్లో దాదాపు రూ.33.44 కోట్ల మద్యాన్ని తాగారు. ఇందులో డిసెంబరు 31వ తేదీన రూ.13.10 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. జిల్లాలో 227 మద్యం దుకాణాలు, 24 బార్లు ఉన్నాయి. 2023 ఏడాది చివర.. డిసెంబరు 30వ తేదీన 7300 కేసుల బీర్లు, 15,500 కేసుల లిక్కర్‌ విక్రయాలు జరిగాయి. తద్వారా దాదాపు రూ 11.02 కోట్ల మద్యాన్ని మందుబాబులు కొనుగోలు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక, న్యూ ఇయర్‌ వేడుకలు జోష్‌గానే సాగాయి. డిసెంబరు 31న ఉదయం నుంచే మందుపార్టీలు చేసుకున్నారు. వీరిలో 20 నుంచి 50 ఏళ్ల వయసున్న వారు ఎక్కువగా ఉన్నట్లు అంచనా. ముఖ్యంగా బార్లు కంటే మద్యం దుకాణాల్లోనే విక్రయాలు ఎక్కువగా జరిగాయని తెలిసింది. 31వ తేదీన 9200 కేస్‌ల బీర్లు, 10,400 కేస్‌ల లిక్కర్‌ విక్రయాలు జరిగాయి. తద్వారా రూ.13.10 కోట్ల లావాదేవీలు జరిగాయి. 30వ తేదీతో పోలిస్తే 31న లిక్కర్‌ అమ్మకాలు తక్కువ. ఆ రోజు దుకాణాల వద్ద రద్దీ.. కొరత ఉండొచ్చన్న భావనతో ముందురోజే లిక్కర్‌ను మందుబాబులు తీసి పెట్టుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, 2023 డిసెంబరు నెలాఖరులో జరిగిన విక్రయాలతో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 67 శాతం పెరిగినట్లు అంచనా. ఇక, జనవరి 1న ఉదయం 10 నుంచి రాత్రి ఏడు గంటల వరకు.. రూ.9.32 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు తెలిసింది. ఇలా మూడు రోజుల్లో రూ.33.44 కోట్ల మద్యాన్ని మందుబాబులు తాగారు.

Updated Date - Jan 02 , 2025 | 01:41 AM