కొత్త ఏడాదిలో జిల్లా ప్రగతి రథాలు పారిశ్రామికం, పర్యాటకం
ABN , Publish Date - Jan 01 , 2025 | 01:25 AM
గతం ఒక జ్ఞాపకం. భవిష్యత్తు ఒక ఆశ. గతం ఎన్ని గాయాలు చేసినా భవిష్యత్తు దిశగా నడిపించేది ఆ ఆశే! కలలకు రెక్కలు తొడిగి నేడు 2025లోకి అడుగుపెడుతున్నాం. ఈ సందర్భంగా జిల్లా రథసారధి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్‌తో ఆంధ్రజ్యోతి సంభాషణ ఇది. జిల్లా అభివృద్ధికి 2025లో పెట్టుకున్న లక్ష్యాలు.. ప్రాధాన్యాలు.. వాటి సాకారానికి చేస్తున్న ప్రయత్నాలను.. జిల్లా ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఇలా వివరించారు.
‘ఆంధ్రజ్యోతి’తో కలెక్టర్ వెంకటేశ్వర్
గతం ఒక జ్ఞాపకం. భవిష్యత్తు ఒక ఆశ. గతం ఎన్ని గాయాలు చేసినా భవిష్యత్తు దిశగా నడిపించేది ఆ ఆశే! కలలకు రెక్కలు తొడిగి నేడు 2025లోకి అడుగుపెడుతున్నాం. ఈ సందర్భంగా జిల్లా రథసారధి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్‌తో ఆంధ్రజ్యోతి సంభాషణ ఇది. జిల్లా అభివృద్ధికి 2025లో పెట్టుకున్న లక్ష్యాలు.. ప్రాధాన్యాలు.. వాటి సాకారానికి చేస్తున్న ప్రయత్నాలను.. జిల్లా ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఇలా వివరించారు.
- తిరుపతి(కలెక్టరేట్), ఆంధ్రజ్యోతి
పరిశ్రమలకు రాయితీలు
పారిశ్రామిక, పర్యాటక రంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నాం. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చిన ఔత్యాహిక పారిశ్రామికవేత్తలకు రాయితీలు కల్పిస్తాం. ఏర్పేడు వద్ద ఎలకా్ట్రనిక్ క్లస్టర్ ఏర్పాటుకు 7 వేల ఎకరాలు కేటాయించాం. కృష్ణపట్నం పోర్టు వద్ద క్రిష్ సిటీ (కృష్ణపట్నం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ) ప్రాజెక్టులో భాగంగా రూ.1,500 కోట్లతో పారిశ్రామిక కారిడార్ సిద్ధం అవుతోంది. పలు జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలు అక్కడికి వస్తున్నాయి. దీనివల్ల తిరుపతి జిల్లాకు చాలా మేలు జరుగుతుంది. ప్రస్తుతం శ్రీసిటీ 8వేల ఎకరాల్లో ఉంది. మరో 2వేల ఎకరాలు భూసేకరణ సిద్ధం చేసి పెట్టాం. కొన్ని అంతర్జాతీయ పరిశ్రమలు ఆక్కడ ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి.
అభివృద్ధికి రాదారులు
వివిధ రాష్ట్రాలను కలుపుతూ జాతీయ రహదారుల నిర్మాణ పనులు కూడా వేగవంతమయ్యాయి. తిరుపతి-చెన్నై, తిరుపతి-మదనపల్లెతో పాటు సాగరమాల రోడ్ల నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఇవన్నీ జిల్లా అభివృద్ధిని వేగవంతం చేస్తాయి.
ఆధ్యాత్మిక పర్యాటకం
జిల్లాగా ఏర్పడిన తరువాత తిరుపతికి తీర ప్రాంతం కలిసొచ్చింది. తిరుమల క్షేత్రం ఇక్కడే ఉంది. శ్రీకాళహస్తి, తిరుచానూరు సహా అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించాలి. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం.
యువతకు ఉపాధి
తిరుమలకు దేశ, విదేశాల నుంచి నిత్యం వేలాది మంది తరలివస్తున్నారు. వారు రెండు రోజుల పాటు జిల్లాలోనే ఉండేలా చూడగలగాలి. ఆహ్లాదంగా గడపడానికి ఎన్నో ప్రదేశాలున్నాయి. జలపాతాలు, బీచ్‌లు, పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షుల కేంద్రం, షార్ సందర్శించే విధంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాం. పర్యాటక రంగం అభివృద్ధి వల్ల ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయి.
మెట్రోలకు దీటుగా తిరుపతి
ఏడాదిలో.. మెట్రో నగరాలతో పోటీపడేలా తిరుపతిని అభివృద్ధి చేయాలన్న సీఎం చంద్రబాబు సంకల్పాన్ని సాకారం చేస్తాం. అందుకు ప్రణాళికలు రూపొందించాం.
వ్యవసాయంలో సాంకేతికత
వ్యవసాయం మీద ఆధారపడిన తిరుపతి జిల్లాలో వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక వ్యవస్థను తీసుకొస్తున్నాం. అందులో డ్రోన్ వ్యవస్థ ప్రధానమైంది. ఉద్యానవన పంట ల్లో మామిడే కాకుండా ఇత ర పంటలపై కూడా రైతులకు ఆసక్తికలిగేలా పలు రాయితీలు ఇవ్వాలని నిర్ణయించాం. తీర ప్రాంతంలో ఆక్వా, చేపల ఉత్పత్తికి అధిక ప్రాధాన్యమిస్తున్నాం.
చెత్తరహిత పట్టణాలు
చెత్త రహిత పట్టణాలుగా ప్రతి మున్సిపాలిటీకి సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్ నిర్మిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో కూడా రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తాం.
హాస్టళ్లలో మౌలిక వసతులు
జిల్లాలో ప్రభుత్వ సంక్షే మ వసతిగృహాల్లో చదివే వారం తా పేదలే.ప్రతి హాస్టల్‌లో మౌలిక వసతులు ఉండే విధంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. వాటితో పేదపిల్లలకు నాణ్యమైన విద్య తో పాటు సరైన వసతి ఉండే లా చర్యలు తీసుకుంటున్నాం. కొత్త ఏడాదిలో దీనిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం.