భక్తులతో పోటెత్తిన కాణిపాకం
ABN , Publish Date - Jan 02 , 2025 | 01:24 AM
జనవరి ఫస్టును పురస్కరించుకొని కాణిపాక ఆలయం బుధవారం భక్తులతో పోటెత్తింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు భక్తులు వరసిద్ధుడి దర్శనార్థం వస్తూనేవున్నారు.
ఐరాల(కాణిపాకం), జనవరి1(ఆంధ్రజ్యోతి): జనవరి ఫస్టును పురస్కరించుకొని కాణిపాక ఆలయం బుధవారం భక్తులతో పోటెత్తింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు భక్తులు వరసిద్ధుడి దర్శనార్థం వస్తూనేవున్నారు. ఆలయ క్యూలైన్లు పూర్తిగా నిండి పోయి మాడ వీధుల దాకా భక్తులు కన్పించారు. దీంతో స్వామి దర్శనానికి సుమారు నాలుగు గంటలకు పైగా పట్టింది.భక్తులకు ఆలయం తరపున బాదంపాలు,బిస్కెట్లు,పులిహోర అందించారు.అన్నదాన కేంద్రంలో భక్తులకు బఫెట్ భోజనం అందించారు. ఆలయ ఈవో కిషోర్, ఈఈ వెంకటనారాయణ,ఏఈవోలు రవీంద్రబాబు,ఎస్వీ.కృష్ణారెడ్డి,హరిమాధవరెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాణి,వాసు, ఆలయ ఇన్‌స్పెక్టర్లు బాలాజీనాయుడు,చిట్టిబాబు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.